Reels: ఫ్లై ఓవర్ మీద కారు ఆపి రీల్స్.. ఆపై బ్యారికేడ్‌కు నిప్పు
ABN, Publish Date - Mar 31 , 2024 | 07:38 AM
ఢిల్లీ పశ్చిమ విహర్‌లో గల ఫ్లై ఓవర్ మీద ప్రదీప్ అనే వ్యక్తి రద్దీ సమయంలో కారును ఆపాడు. ఇన్ స్ట రీల్ కోసం అలా చేశాడు. తర్వాత కారు డోర్ ఓపెన్ చేసి మరి నడిపాడు. దాంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించలేదు. ఆ తర్వాత పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్‌కు నిప్పు అంటించాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ప్రదీప్‌పై పోలీసులు మోటారు వాహన చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీ: రీల్స్ (Reels) మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో ఒకతను ఫ్లై ఓవర్ మీద కారును ఆపాడు. ఇన్ స్ట్రాగ్రామ్ రీల్స్ కోసం వీడియో తీసుకున్నాడు. దీంతో ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఇలా చేయొద్దు అని చెబితే పోలీసులు (Police) ఏర్పాటు చేసిన బ్యారెకేడ్‌కు నిప్పు అంటించాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
ఏం జరిగిందంటే..?
ఢిల్లీ పశ్చిమ విహర్‌లో గల ఫ్లై ఓవర్ మీద ప్రదీప్ అనే వ్యక్తి రద్దీ సమయంలో కారును ఆపాడు. ఇన్ స్ట రీల్ కోసం అలా చేశాడు. కాసేపటి తర్వాత కారు డోర్ ఓపెన్ చేసి మరి కారు నడిపాడు. దాంతో ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని ఆలోచించలేదు. ఆ తర్వాత పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్‌కు నిప్పు అంటించాడు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ప్రదీప్‌పై పోలీసులు మోటారు వాహన చట్టం కింద కేసు నమోదు చేశారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. బ్యారికేడ్‌ను ధ్వంసం చేసినందుకు రూ.36 వేల జరిమానా విధించారు.
ఆయుధాలు స్వాధీనం
ప్రదీప్ వాడిన కారు అతని తల్లి పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ప్రదీప్‌ను అరెస్ట్ చేసిన తర్వాత అతని కారును పోలీసులు పరిశీలించారు. అందులో కొన్ని ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఆయుధాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు గతంలో కూడా ప్రదీప్ దురుసుగా ప్రవర్తించాడని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
బీజేపీలో చేరితే దావూద్‌పైనా కేసులుండవు!
Updated Date - Mar 31 , 2024 | 08:03 AM