ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : సీయూఈటీ ఫలితాల వెల్లడి

ABN, Publish Date - Jul 29 , 2024 | 03:23 AM

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ-యూజీ) పరీక్షల ఫలితాలను ఆదివారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది.

న్యూఢిల్లీ, జూలై 28: అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ-యూజీ) పరీక్షల ఫలితాలను ఆదివారం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన జవాబుల ‘కీ’ని ఈ నెల ఏడో తేదీన విడుదల చేసింది.

వేయి మందికిపైగా అభ్యర్థులకు సమస్యలు ఎదురుకావడంతో వారి కోసం ఈ నెల 19న ప్రత్యేకంగా రీటెస్ట్‌ జరపాల్సి వచ్చింది. ఈ కారణంగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగింది.

ముందుగా నిర్ణయించినదాని ప్రకారమయితే జూన్‌ 30నే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా, ఇతర పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో వీటి విడుదలను కూడా ఎన్‌టీఏ జాప్యం చేసింది. 261 సెంట్రల్‌, స్టేట్‌, డీమ్డ్‌, ప్రయివేటు వర్సిటీల్లో ప్రవేశాల కోసం 13.4 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.

Updated Date - Jul 29 , 2024 | 03:23 AM

Advertising
Advertising
<