ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : పోలీసులు గుర్తు పట్టకుండా ప్లాస్టిక్‌ సర్జరీలు

ABN, Publish Date - Jul 12 , 2024 | 05:34 AM

పోలీసులు తమను గుర్తుపట్టకుండా ఫిలిప్పీన్స్‌లో నేరగాళ్లు ప్లాస్టిక్‌ సర్జరీలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికోసమని ఆ దేశంలో కొన్ని రహస్య ఆస్పత్రులు కూడా వెలిశాయి.

  • అరెస్టుల నుంచి తప్పించుకొనేందుకు ఫిలిప్పీన్స్‌లో నేరగాళ్ల కొత్త ఎత్తులు

న్యూఢిల్లీ, జూలై 11: పోలీసులు తమను గుర్తుపట్టకుండా ఫిలిప్పీన్స్‌లో నేరగాళ్లు ప్లాస్టిక్‌ సర్జరీలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికోసమని ఆ దేశంలో కొన్ని రహస్య ఆస్పత్రులు కూడా వెలిశాయి. మే నెలలో అధికారులు ఓ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించిన సమయంలో ఈ విషయం వెల్లడైంది. తాజాగా, మరో రహస్య ఆస్పత్రిని గుర్తించారు. ఈ హాస్పిటళ్లలో హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ పరికరాలు, దంత నమూనాలు, శరీరం రంగును మార్చే ద్రావణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో ఒక మనిషి రూపురేఖలను పూర్తిగా మార్చవచ్చని అధికారులు తెలిపారు. ఈ రహస్య ఆస్పత్రుల క్లయింట్లంతా నిబంధనలకు విరుద్ధంగా ఫిలిప్పీన్స్‌లో ఉంటున్నవారు, క్యాసినో ఆడేవారు, గ్యాంబ్లర్లు, కరడుగట్టిన నేరస్థులేనని వివరించారు. ఈ వ్యవహారంలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు వియత్నాం, ఒకరు చైనాకు చెందినవారు. ఈ రెండు ఆస్పత్రులను శాశ్వతంగా మూసివేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 05:34 AM

Advertising
Advertising
<