ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM MODI: ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపు.. వాళ్లకు పోలీసుల వార్నింగ్..

ABN, Publish Date - Mar 26 , 2024 | 12:26 PM

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్‌(Kejriwal)ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్‌(Kejriwal)ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముట్టడికి ఆప్ పిలుపునిచ్చింది. దీంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలు లేదా ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై గత వారం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కేజ్రీవాల్ ఈడీ కస్టీడీలో ఉన్నారు. మరోవైపు తాను జైలు నుంచే పాలన చేస్తానని ప్రకటించగా.. ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ (BJP) డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్ ఆందోళనలను తీవ్రతరం చేస్తుంది. మోదీ నివాసం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కొన్ని హెచ్చరికలు జరీ చేశారు. మరోవైపు ఢిల్లీలో తీసుకున్న భద్రతా చర్యలపై పోలీసులు ప్రకటన చేశారు.

కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్‌ సోషల్‌ మీడియా ఉద్యమం

పోలీసుల వార్నింగ్

ప్రధాని మోదీ నివాసం ముట్టడికి ఎలాంటి అనుమతి లేదని, నివాసం చుట్టూ అదనపు భద్రత ఏర్పాటు చేశామని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు . న్యూఢిల్లీ ప్రాంతంలో 50 పెట్రోలింగ్ వాహనాలను సిద్ధం చేశామన్నారు. అన్ని ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రయాణాలపై ఎటువంటి పరిమితి లేదన్నారు.

144 సెక్షన్

ఢిల్లీలో ఇప్పటికే సెక్షన్ 144 అమలులో ఉందని, ఎటువంటి నిరసనలకు అనుమతి లేదన్నారు. ఎవరైనా నిరసన తెలిపితే వెంటనే అదుపులోకి తీసుకుంటామని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేవేష్ కుమార్ హెచ్చరించారు.

Kejriwal: కంప్యూటర్, కాగితాలు ఎలా అందాయి.. జైలు నుంచే ఆర్డర్స్ ఇష్యూపై ఈడీ చర్యలు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 26 , 2024 | 02:00 PM

Advertising
Advertising