ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : దేశంలో మంకీపాక్స్‌ కేసులు లేవు

ABN, Publish Date - Aug 18 , 2024 | 03:23 AM

మంకీపాక్స్‌ వ్యాప్తిని హెల్త్‌ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. దేశంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి జేపీ నడ్డా శనివారం సమీక్ష నిర్వహించారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మంకీపాక్స్‌ వ్యాప్తిని హెల్త్‌ ఎమర్జెన్సీగా డబ్ల్యూహెచ్‌ఓ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. దేశంలో పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి జేపీ నడ్డా శనివారం సమీక్ష నిర్వహించారు.

దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దుల వద్ద ఉన్న ఆరోగ్య కేంద్రాలను అప్రమత్తం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను సన్నద్ధం చేయాలని, కేసులు బయటపడితే వ్యాప్తి జరగకుండా రోగిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించటానికి వీలుగా ఆస్పత్రులను సంసిద్ధం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం దేశంలో మంకీపాక్స్‌ కేసులు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. రానున్న రోజుల్లో మంకీపాక్స్‌ కేసులు బయటపడ్డా దేశంలో అది ఒక మహమ్మారిలా వ్యాప్తి చెందే అవకాశాలు లేవని అందులో పేర్కొంది. మంకీపాక్స్‌పై డబ్ల్యూహెచ్‌ఓ తొలిసారిగా 2022లో హెల్త్‌ ఎమర్జెన్సీ హెచ్చరికను జారీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. నాటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశంలో 20 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

Updated Date - Aug 18 , 2024 | 06:53 AM

Advertising
Advertising
<