ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : ఆగస్టు చివరికల్లా దేశవ్యాప్తంగా యూ-విన్‌

ABN, Publish Date - Jul 15 , 2024 | 03:12 AM

గర్భిణులు, పిల్లలకు ఇచ్చే టీకాల నమోదుకు సంబంధించిన యూ-విన్‌ పోర్టల్‌ వచ్చే ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ నిర్వహణ వ్యవస్థ ......

న్యూఢిల్లీ, జూలై 14: గర్భిణులు, పిల్లలకు ఇచ్చే టీకాల నమోదుకు సంబంధించిన యూ-విన్‌ పోర్టల్‌ వచ్చే ఆగస్టు చివరినాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ నిర్వహణ వ్యవస్థ కోసం తెచ్చిన కో-విన్‌ తరహాలోనే యూ-విన్‌ను రూపొందించారు.

సాధారణ టీకాల పంపిణీని ఎలక్ర్టానిక్‌ రిజిస్ర్టీ రూపంలో నిర్వహించాలన్న లక్ష్యంతో తీసుకువస్తున్న యూ-విన్‌ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు (పశ్చిమబెంగాల్‌ మినహా), కేంద్రపాలిత ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా నడుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 9 నాటికి వ్యాక్సిన్‌ తీసుకున్న 5.33 కోట్ల మంది వివరాలను యూ-విన్‌లో నమోదు చేశారు. యూనివర్సల్‌ ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్‌ (యూఐపీ) కింద గర్భిణులు, పిల్లలకు ఇచ్చే ప్రతి వ్యాక్సినేషన్‌ను యూ-విన్‌ ప్లాట్‌ఫామ్‌లో పొందుపరచనున్నారు.

వీరికి సకాలంలో టీకాలను ఇవ్వడానికి యూ-విన్‌ దోహదపడుతుంది. ప్రస్తుతం యూఐపీ కింద వ్యాక్సినేషన్‌ రికార్డులను మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. యూ-విన్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ స్థాయిని రియల్‌ టైమ్‌ ప్రాతిపదికన అప్‌డేట్‌ చేయనున్నారు.

Updated Date - Jul 15 , 2024 | 03:12 AM

Advertising
Advertising
<