Share News

Water Crisis: మంచినీటిని వృధా చేస్తే.. రూ. 2 వేలు ఫైన్

ABN , Publish Date - May 29 , 2024 | 05:47 PM

ఓ వైపు వేసవి కాలం.. మరోవైపు ఢిల్లీలో మంచినీటి‌ సరఫరాను హరియాణా నిలిపివేసింది. దీంతో న్యూఢిల్లీలో తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడింది. దాంతో దేశ రాజధానిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి వేళ మంచి నీటి వృధా చేయకుండా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

Water Crisis: మంచినీటిని వృధా చేస్తే.. రూ. 2 వేలు ఫైన్

ఢిల్లీ, మే 29: ఓ వైపు వేసవి కాలం.. మరోవైపు ఢిల్లీలో మంచినీటి‌ సరఫరాను హరియాణా నిలిపివేసింది. దీంతో న్యూఢిల్లీలో తీవ్ర మంచి నీటి ఎద్దడి ఏర్పడింది. దాంతో దేశ రాజధానిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాంటి వేళ మంచి నీటి వృధా చేయకుండా ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. మంచి నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచించింది. ఓ వేళ నీటిని వృధా చేస్తే.. రూ.2 వేలు ఫైన్ వేస్తామని ప్రకటించింది.

Read Also: బీజేపీ కోసం కలిశాం.. ఈ బంధం శాశ్వతం కాదు


ఆ క్రమంలో మంచి నీటితో పైపుల ద్వారా వాహనాలను కడగవద్దని.. నివాస గృహాలకు కేటాయించిన మంచి నీటి కనెక్షన్లను వాణిజ్య అవసరాలకు వినియోగించ కూడదని.. వాటర్ ట్యాంక్‌ల ద్వారా మంచి నీటి సరఫరాలో.. నీరు వృధాను అరికట్టాలని ప్రజలకు సూచించింది. అందుకోసం ఢిల్లీ మహానగరంలో 200 బృందాలను రంగంలోకి దింపినట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: కరణ్ కాన్వాయి ఢీకొని ఇద్దరు మృతి


ఈ బృందాలు ఉదయం 8.00 గంటల నుంచి నీటి వృధా ఎక్కడ జరుగుతున్నా వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ఫైన్ సైతం విధిస్తాయని తెలిపింది. ఇక నగరంలో అక్రమంగా నీటి కనెక్షన్లు ఉంటే.. వాటిని వెంటనే నిలిపి వేయాలని ఈ సందర్బంగా ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఢిల్లీ మంచి నీటి శాఖ మంత్రి అతిషి బుధవారం ప్రకటించారు.

Also Read: ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్ధం..!


మరోవైపు సార్వత్రిక ఎన్నికల వేళ.. న్యూఢిల్లీలో మంచి నీటి కోరత సృష్టించేందుకు బీజేపీ కొత్త కుట్రకు తెర తీసిందంటూ ఆప్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే హరియాణా నుంచి ఢిల్లీకి మంచి నీటి సరఫరా నిలిచిపోయిందంటూ ఆమె విమర్శించిన విషయం విధితమే.

Also Read: సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం విడి భాగాలు

For More National News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 05:47 PM