ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Cabinet Expansion: క్యాబినెట్‌లో దక్కని చోటు.. పార్టీ పదవికి శివసేన ఎమ్మెల్యే రాజీనామా

ABN, Publish Date - Dec 15 , 2024 | 09:44 PM

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు.

ముంబై: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కకపోవడంతో ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే నరేష్ బోండేకర్ అలిగారు. పార్టీ పదవికి ఆదివారంనాడు రాజీనామా చేశారు. శివసేన డిప్యూటీ నేతగా, విదర్భ పార్టీ సమన్వయకర్తగా ఆయన ఉన్నారు. విదర్భ ప్రాంతంలో 62 సీట్లకు బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి 47 సీట్లు గెలుచుకుంది. భండార-పవని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భాండేకర్ పార్టీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు.

Ajit Pawar: రెండున్నరేళ్లు మీకూ అవకాశం ఇస్తాం.. ఆశావహులకు అజిత్ భరోసా


మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బోండేకర్‌కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ క్యాబినెట్‌లో చోటు దక్కలేదు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఏక్‌నాథ్ షిండే, సీనియర్ నేతలు ఉదయ్ సామంత్, షిండే కుమారుడు శ్రీకాంత్ షిండేలకు టెక్స్ట్ మెసేజ్ పంపినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు. ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఆదివారంనాడు ప్రమాణస్వీకారం చేసిన వారిలో సామంత్ కూడా ఉన్నారు.


రామ్‌దాస్ అథవాలే పార్టీకి దక్కని చోటు

కాగా, ఆర్‌పీఐ చీఫ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సైతం తమ పార్టీకి ఒక మంత్రి పదవిని ఆశించినప్పటికీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దాంతో ఆయన ఫడ్నవిస్ తన మాట నిలబెట్టుకోలేదని, ఆ విషయాన్ని అమిత్‌షా, జేపీ నడ్డా దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే, బీజేపీ నేతలు సుధీర్ ముంగంటివార్, రవీంద్ర చవాన్‌కు కూడా మంత్రివర్గంలో చోటు దక్కలేదు.


ఇవి కూడా చదవండి..

PM Modi: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం

భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర

For National News And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 09:47 PM