ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM: క్రైస్తవుడునని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా..

ABN, Publish Date - Dec 20 , 2024 | 10:31 AM

అన్ని మతాలూ ఆత్మీయ భావాలనే బోధిస్తున్నాయని, తానొక క్రైస్తవుడినని చెప్పుకునేందుకు ఎంతగానో గర్వపడుతున్నానని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) వ్యాఖ్యానించారు.

- కోవై క్రిస్మస్‌ వేడుకల్లో డిప్యూటీ సీఎం

చెన్నై: అన్ని మతాలూ ఆత్మీయ భావాలనే బోధిస్తున్నాయని, తానొక క్రైస్తవుడినని చెప్పుకునేందుకు ఎంతగానో గర్వపడుతున్నానని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) వ్యాఖ్యానించారు. కోయంబత్తూరు గాంధీపురం సమీపంలోని బేతేల్‌ క్రైస్తవ ఆలయంలో గురువారం జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఉదయనిధి మట్లాడుతూ... ప్రపంచమంతా సంతోషంగా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్‌ మాత్రమేనని చెప్పారు.

ఈ వార్తను కూడా చదవండి: డిజిటల్ అరెస్ట్.. అలెర్ట్.. భయపెట్టి దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు


క్రిస్మస్‌ అంటే తనకు చాలా ఇష్టమని, ఈ యేడాది క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని తానొక క్రైస్తవుడినని చెబితే ప్రత్యర్థులందరికీ కడుపుమంటగా మారిందన్నారు. ప్రజలు తనను క్రైస్తవుడిగా భావిస్తే క్రైస్తవుడని, ముస్లింగా భావిస్తే ముస్లిం అని, హిందువు అనుకుంటే హిందువేనని, అన్ని మతాలూ తనకు సమ్మతమేనని పేర్కొన్నారు. దేశంలో మత ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదన్నదే డీఎంకే అభిమతమన్నారు. అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల ఓ సభలో ముస్లింలకు వ్యతిరేకంగా విమర్శ లు చేశారని,


పార్లమెంట్‌లో ఆ న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించే బిల్లుకు డీఎంకే, కూటమి పార్టీల ఎంపీలంతా మద్దతు ప్రకటిస్తే అన్నాడీఎంకే మద్దతు ప్రకటించకుండా మౌనం పాటించిందని ఆరోపించారు. ఇలాంటి అన్నాడీఎంకేను మైనారిటీలకు రక్షణ కలిగించే పార్టీగా ఎవరు విశ్వసిస్తారని ప్రశ్నించారు. క్రైస్తవులు, ముస్లింలు ఎల్లప్పుడూ డీఎంకేకు మద్దతిస్తారని, వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా వారికి మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఉదయనిధి వెల్లడించారు.


ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్‌ ఏ1

ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2024 | 10:31 AM