ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM: నా ఆస్తులు వెల్లడిస్తా.. మరి.. కుమారస్వామి సోదరుడి ఆస్తులు చెప్పాలి

ABN, Publish Date - Aug 06 , 2024 | 10:49 AM

‘నా ఆస్తులు బహిరంగం చేస్తా... కుమారస్వామి సోదరుడు బాలకృష్ణ గౌడ ఆస్తులు చెప్పాలి’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) సవాల్‌ విసిరారు. సోమవారం మద్దూరులో కాంగ్రెస్‌ ప్రజాందోళన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) తనను ప్రశ్నిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేహక్కు అందరికీ ఉందని అన్నారు.

- పాదయాత్రలకు బెదిరేవాడిని కాదు

- మద్దూరు సభలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌

బెంగళూరు: ‘నా ఆస్తులు బహిరంగం చేస్తా... కుమారస్వామి సోదరుడు బాలకృష్ణ గౌడ ఆస్తులు చెప్పాలి’ అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(Deputy Chief Minister DK Shivakumar) సవాల్‌ విసిరారు. సోమవారం మద్దూరులో కాంగ్రెస్‌ ప్రజాందోళన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) తనను ప్రశ్నిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేహక్కు అందరికీ ఉందని అన్నారు. అంతకు ముందు ఆయన అన్న ఆస్తుల గురించి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జేడీఎస్‌ - బీజేపీ అవినీతి అక్రమాలపై సమాధానం చెప్పాలని అన్నారు.

ఇదికూడా చదవండి: Bangladesh Turmoil: కేంద్రానికి పశ్చిమ బెంగాల్ గవర్నర్ మద్దతు


విజయేంద్ర తనను అవినీతి పితామహ అంటూ సంబోధించారని, ఇంతకీ యడియూరప్ప(Yeddyurappa) జైలుకు ఎందుకు వెళ్లారో వివరించాలని డిమాండ్‌ చేశారు. మీ ఎమ్మెల్యేలు బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌, గూళిహట్టి శేఖర్‌ ప్రశ్నలకు సమాధానం చెబితే బాగుంటుందని హితవు పలికారు. ఇలాంటి పాదయాత్రలకు బెదిరేవాడిని కాదన్నారు. తాను ఆరాధించే అజ్జయ్య జోలికి రాకూడదన్నారు. అజ్జయ్యశక్తి తనకు తెలుసు అన్నారు. శివకుమార్‌ తల్లిదండ్రులకు పుట్టలేదని ఒకప్పుడు ఆరోపించిన కుమారస్వామి(Kumaraswamy) నేరుగా సాతనూరుకు వచ్చి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. సిద్దరామయ్యను తాకే శక్తి మీలో లేదన్నారు. జేడీఎస్‌, బీజేపీకి పేదల సంక్షేమం గురించి పట్టదన్నారు.


అందుకే పాదయాత్రల పేరిట రాజకీయం చేస్తున్నారన్నారు. మీ పెన్‌డ్రైవ్‌(pen drive) విషయంలో మేం జోక్యం చేసుకున్నామా..? అని ప్రశ్నించారు. 1985 నుంచి వారి కుటుంబంతో తనకు విభేదాలు ఉన్నాయన్నారు. కుమారస్వామి నోరు తెరిస్తే అబద్ధాలే అన్నారు. పెన్‌డ్రైవ్‌ దొరికినప్పుడు రేవణ్ణ వేరు, తాను వేరన్నారని, ఇప్పుడు మాత్రం తమ కుటుంబంపై ప్రీతంగౌడ దాడి చేశారని ఆరోపించారని అన్నారు. బ్రిటీష్ వారే కాంగ్రెస్‌ పార్టీని కదిలించలేకపోయారని, మీరెంత అన్నారు. మంత్రులు హెచ్‌కే పాటిల్‌, రాజణ్ణ, దినేశ్‌గుండూరావు, చలువరాయస్వామి, సుధాకర్‌, శివానందపాటిల్‌తోపాటు ఢిల్లీ అధికార ప్రతినిధి టీబీ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి

ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!

Updated Date - Aug 06 , 2024 | 10:49 AM

Advertising
Advertising
<