Ramdas Athawale: షిండే హ్యాపీగా లేరు.. కేంద్ర మంత్రి వెల్లడి
ABN, Publish Date - Nov 26 , 2024 | 04:51 PM
ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయంగా ఉందని, అయితే ఏక్‌నాథ్ షిండే సంతోషంగా లేరని, ఆయన అసంతృప్తిని తొలగించాల్సి ఉంటుందని రామదాస్ అథవాలే అన్నారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ-అథవాలే అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలే (Ramdas Athawale) మంగళవారంనాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయంగా ఉందని, అయితే ఏక్‌నాథ్ షిండే సంతోషంగా లేరని, ఆయన అసంతృప్తిని తొలగించాల్సి ఉంటుందని అన్నారు. త్వరలోనే ఈ వివాదానికి తెరపడుతుందని చెప్పారు.
National Politics: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారా.. అసలు విషయం తెలుసుకోండి...
''దేవేంద్ర ఫడ్నవిస్ 4 అడుగులు వెనక్కి తీసుకున్నట్టే ఏక్‌నాథ్ షిండే కూడా రెండడుగులు వెనక్కి తీసుకోవాలి. ఫడ్నవిస్ నాయకత్వం కింద పనిచేసే విషయంపై ఆయన ఆలోచించాలి. ఏక్‌నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రి కూడా కావచ్చు'' అని అథవాలే అన్నారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తప్పనిసరిగా దీనిపై ఆలోచించి సాధ్యమైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నట్టు చెప్పారు. ''ఏక్‌నాథ్ షిండే, ఆయన 57 మంది ఎమ్మెల్యేలు అవసరం మాకుంది. త్వరగా ఒక అవగాహనకు వచ్చి, గట్టి ధీమాతో క్యాబినెట్ విస్తరణ జరపాలి. క్యాబినెట్‌లో మా పార్టీకి కనీసం ఒక మంత్రి పదవి ఇవ్వాలి. దేవేంద్ర ఫడ్నవిస్ ముందు కూడా మా పార్టీ డిమాండ్‌ను ఉంచా'' అని అథవాలే తెలిపారు.
డిసెంబర్ 2న..
అధికారికంగా సీఎం ఎవరనేది 'మహాయుతి' కూటమి ప్రకటించనప్పటికీ మరో నాలుగైదు రోజుల్లో ముఖ్యమంత్రితో సహా కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. డిసెంబర్ 2వ తేదీన అతిపెద్ద ఈవెంట్‌గా ఈ ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. సీఎం పదవే ప్రధాన అంశంగా ఉండటంతో కూటమి నేతలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఇదేనట
President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’
Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 26 , 2024 | 04:58 PM