ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai : తమిళనాట బడ్జెట్‌ సెగలు.. డీఎంకే ధర్నా

ABN, Publish Date - Jul 28 , 2024 | 06:10 AM

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు వ్యాప్తంగా శనివారం ధర్నాలు జరిగాయి. బడ్జెట్‌లో రాష్ట్రానికంటూ ఎలాంటి కొత్త పథకాల ప్రస్తావనలుగానీ, రెండో దశ మెట్రోరైలు వంటి పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులుగానీ లేకపోవటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెన్నై, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడు వ్యాప్తంగా శనివారం ధర్నాలు జరిగాయి. బడ్జెట్‌లో రాష్ట్రానికంటూ ఎలాంటి కొత్త పథకాల ప్రస్తావనలుగానీ, రెండో దశ మెట్రోరైలు వంటి పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులుగానీ లేకపోవటం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశాన్ని కూడా బహిష్కరించారు.

ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో స్టాలిన్‌ మినహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ మేయర్లు, మునిసిపాలిటీల అధ్యక్షులు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. చెన్నైలో నాలుగు చోట్ల జరిగిన ధర్నాల్లో ఎంపీలు దయానిధి మారన్‌, తమిళచ్చి తంగపాండ్యన్‌, కళానిధి వీరాసామి, తూత్తుకుడిలో జరిగిన ఆందోళనలో ఎంపీ కనిమొళి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తమ పార్టీని గెలిపించలేదన్న ఆగ్రహంతో తమిళ ప్రజలపై కక్షగట్టిన బీజేపీ రాష్ట్రంలో ఇక వరుస పరాజయాలు తప్పవని స్టాలిన్‌ హెచ్చరించారు.

Updated Date - Jul 28 , 2024 | 06:10 AM

Advertising
Advertising
<