Share News

Arvind Kejriwal: తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న కేజ్రీవాల్

ABN , Publish Date - Jun 02 , 2024 | 05:42 PM

తాను ఈ 21 రోజల్లో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయ లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల వేళ అన్ని పార్టీల తరఫున తాను ప్రచారం చేశానని చెప్పారు. ఈ ప్రచారంలో దేశాన్ని రక్షించాలని ప్రజలకు సూచించానన్నారు. ముందు దేశం ముఖ్యమని.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Arvind Kejriwal: తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీ, జూన్ 02: తాను ఈ 21 రోజల్లో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయ లేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల వేళ అన్ని పార్టీల తరఫున తాను ప్రచారం చేశానని చెప్పారు. ఈ ప్రచారంలో దేశాన్ని రక్షించాలని ప్రజలకు సూచించానన్నారు. ముందు దేశం ముఖ్యమని.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ అని ఆయన ఈ సందర్బంగా పేర్కొన్నారు. తీహాడ్ జైల్లో లొంగిపోయే ముందు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణుతో సమావేశమయ్యారు.

Also Read: Amaravati Farmers: సీఎం జగన్ పాపం పండనుంది


ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. సుప్రీంకోర్టు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పూర్తిగా ఫలవంతమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ఇది మరిచి పోలేని అనుభూతి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ.. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని చూపించ లేక పోయారన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనమని చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుందనే.. ఏ ఆధారం లేకుండా తనను జైల్లో పెట్టారని కేజ్రీవాల్ ఆరోపించారు.

Also Read: UttaraPradesh: జూలో సీఎం యోగి ఆకస్మిక తనిఖీలు


తనను జైలులో పెట్టడం ద్వారా. దేశంలో ఎవరినైనా జైలుకు పంపుతామనే సందేశాన్ని ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినట్లు అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది నియంత పాలనకు నిదర్శనమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ భార్య సునీత, పార్టీ నాయకులు, ఢిల్లీ మంత్రులు అతిశీ, కైలాశ్ గెహ్లట్, సౌరభ్ భరద్వాజ్, రాజ్యసభ ఎంపీలు సంజయ్ సింగ్, సందీప్ పాథక్‌తోపాటు దుర్గేశ్ పాథక్, రాకీ బిర్లా, రీనా గుప్తా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తీహాడ్ జైలుకు బయలుదేరే ముందు తన తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వారి నుంచి కేజ్రీవాల్ ఆశీర్వాదం తీసుకున్నారు.

Also Read: తీహాడ్ జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ ఏం చేశారంటే..

kejriwal.jpg


జూన్ 1వ తేదీతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తుది దశ ముగిసింది. దీంతో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ కూడా అదే రోజు ముగిసింది. దాంతో జూన్ 2వ తేదీన తీహాడ్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. అంతకు ముందు కేజ్రీవాల్ ఆప్ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. అనంతరం రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీ సమాధిని సందర్శించి.. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్‌లోని శ్రీఆంజనేయస్వామి దేవాలయంకు వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. చివరకు తీహాడ్ జైలుకు కేజ్రీవాల్ వెళ్లారు.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 05:50 PM