ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP: బీజేపీ సీఈసీ సమావేశంలో 16 రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థులపై చర్చ..!

ABN, Publish Date - Mar 01 , 2024 | 09:57 AM

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు తెల్లవారు జామున 4.30 వరకు కొనసాగింది. బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఇక ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్‌సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారని సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ: బీజేపీ (BJP) కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం దాదాపు తెల్లవారు జామున 4.30 వరకు కొనసాగింది. బీజేపీ లోక్‌సభ (Loksabha) అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఇక ఈ సమావేశంలో దాదాపు 16 రాష్ట్రాల నుంచి లోక్‌సభ అభ్యర్థుల పేర్లను చర్చించి ఖరారు చేశారని సమాచారం. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తొలుత ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) అభ్యర్థుల పేర్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. యూపీ తర్వాత పశ్చిమ బెంగాల్ (West Bengal) అభ్యర్థుల పేర్లు.. ఆ తరువాత అన్ని సీట్లపై చర్చ జరిగింది. దీని తర్వాత ఛత్తీస్‌గఢ్‌ (Chattisgarh)పై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

అనంతరం తెలంగాణకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈసారి ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, కేరళ (Kerala)పై చర్చ జరిగింది. కేరళలోని అన్ని సీట్లపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 5-6 సీట్ల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం రాజస్థాన్ సీట్లపై కూడా చర్చ జరిగింది. ఈ భేటీకి రాజస్థాన్ సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ హాజరయ్యారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. చింద్వారా కోసం ప్రత్యేక వ్యూహం రూపొందించినట్టు సమాచారం.

ఇక అనంతరం వరుసగా.. గుజరాత్‌, జార్ఖండ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా, ఢిల్లీలపై కూడా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులపై చర్చించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో, జమ్మూ ప్రాంతంలోని సీట్లపై మాత్రమే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా పోటీ చేయడంపై చర్చ జరిగింది. రాజౌరి లేదా అనంతనాగ్ స్థానం నుంచి రైనా పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అస్సాంలోని దాదాపు మొత్తం 14 స్థానాలపై కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించడం జరిగింది. అస్సాం నుంచి దాదాపు 40 శాతం మంది అభ్యర్థులు మారనున్నారు. ఇక నేటి తెల్లవారుజామున 3:20కు ప్రధాని మోదీ వెళ్లిపోయారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 10:07 AM

Advertising
Advertising