ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

District Magistrate : లోపాలకు అధికారులే బాధ్యులు..

ABN, Publish Date - Aug 12 , 2024 | 04:10 AM

ఢిల్లీలోని ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో వరదల కారణంగా ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై చేపట్టిన విచారణ దర్యాప్తు నివేదికను జిల్లా మెజిస్ట్రేట్‌ (సెంట్రల్‌) సుధాకర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ (ఎంసీడీ), ఢిల్లీ అగ్నిమాపక సేవల (డీఎ్‌ఫఎస్‌) అధికారులే పెద్ద లోపాలకు బాధ్యులుగా దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.

  • నిబంధనల ఉల్లంఘన తెలిసి ఉదాసీనం

  • ‘ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌’ దుర్ఘటనపై నివేదిక

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఢిల్లీలోని ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌లో వరదల కారణంగా ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనపై చేపట్టిన విచారణ దర్యాప్తు నివేదికను జిల్లా మెజిస్ట్రేట్‌ (సెంట్రల్‌) సుధాకర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ (ఎంసీడీ), ఢిల్లీ అగ్నిమాపక సేవల (డీఎ్‌ఫఎస్‌) అధికారులే పెద్ద లోపాలకు బాధ్యులుగా దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.

సెంట్రల్‌ ఢిల్లీలోని సదరు కోచింగ్‌ సెంటర్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తెలిసినా ఆ రెండు విభాగాల అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తేల్చారు. ‘అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రం లేకుండానే ఎంసీడీ భవన ప్లాన్‌ను ఆమోదించింది. విద్యా అవసరాలకు కాకుండా కార్యాలయ/వ్యాపార అవసరాలకు మాత్రమే ఆ భవనానికి అనుమతి ఉంది.

దాని ఎత్తు 9 మీటర్లకు మించి ఉన్నందున అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రం తప్పనిసరి. భవన సెల్లార్‌లో లైబ్రరీ నిర్వహించడం కోచింగ్‌ సెంటర్‌, యాజమాన్యం నేరపూరిత నిర్లక్ష్యమే. అక్కడి కోచింగ్‌ సెంటర్లను రోహిణి, నరేలాకు మార్చాలి’ అని నివేదికలో పేర్కొన్నారు.

Updated Date - Aug 12 , 2024 | 04:11 AM

Advertising
Advertising
<