ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Incident: వారి మృతికి మాదే బాధ్యత: ఎంసీడీ అదనపు కమిషనర్ తారిక్

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:10 PM

ఈనెల 27న రాజేందర్ నగర్ రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో వరదనీటిలో చిక్కుకుని ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అదనపు కమిషనర్ తారిక్ థామస్ స్పందించారు. అభ్యర్థుల మృతికి తమ వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. మా కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ: ఈనెల 27న రాజేందర్ నగర్ రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో వరదనీటిలో చిక్కుకుని ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అదనపు కమిషనర్ తారిక్ థామస్ స్పందించారు. అభ్యర్థుల మృతికి తమ వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. మా కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.


అయితే రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ బేస్మెంట్‌లో వరదనీటిలో చిక్కుకుని తానియా సోని, శ్రేయ యాదవ్, నెవిన్ డాల్విన్ అనే ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఘటనకు మున్సిపల్ అధికారులదే బాధ్యత అంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రమాదానికి తామే పూర్తి బాధ్యులమని, ఆందోళన విరమించాలని ఎంసీడీ కమిషనర్ తారిక్ థామక్ విజ్ఞప్తి చేశారు.


మరోవైపు ముగ్గురు యూపీఎస్సీ ఆశావహుల మృతిని నిరసిస్తూ ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఘటన దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసింది. ఘటన ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు, బాధ్యులు ఎవరు? అనే అంశాలపై 30రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ప్రమాదం అనంతరం ఢిల్లీ మున్సిపల్ అధికారులు అప్రమత్తం అయ్యారు. మిగతా కోచింగ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టి సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం 13కోచింగ్ సెంటర్లను మూసివేశారు.


సివిల్స్ అభ్యర్థుల మృతిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటాగా కేసు నమోదు చేసింది. ప్రమాదంపై రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ ఆప్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వంతోపాటు, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Jul 31 , 2024 | 12:10 PM

Advertising
Advertising
<