PM Modi: విపక్ష నేతలు నాకేమీ శత్రువులు కాదు: మోదీ
ABN, Publish Date - May 24 , 2024 | 09:35 PM
విపక్ష నేతలను తాను ఎప్పుడూ శత్రువులుగా భావించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అందర్నీ కలుపుకుని వెళ్లాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విపక్షాల దాడులు, తన అభివృద్ధి సిద్ధాంతం, ప్రస్తుతం నడుస్తున్న లోక్‌సభ ఎన్నికలు సహా పలు అంశలపై ప్రధాని సమాధానమిచ్చారు.
న్యూఢిల్లీ: విపక్ష నేతలను తాను ఎప్పుడూ శత్రువులుగా భావించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అందర్నీ కలుపుకొని వెళ్లాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విపక్షాల దాడులు, తన అభివృద్ధి సిద్ధాంతం, ప్రస్తుతం నడుస్తున్న లోక్‌సభ ఎన్నికలు సహా పలు అంశలపై ప్రధాని సమాధానమిచ్చారు.
విపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై అడిగిన ఒక ప్రశ్నకు మోదీ సమాధానమిస్తూ, వాళ్లను తాను ఎప్పుడూ శత్రువులుగా అనుకోలేదని, ఎవరినీ తాను తక్కువగా అంచనా వేయనని చెప్పారు. విపక్షాలు 60 నుంచి 70 ఏళ్ల పాలించాయని, వాళ్లు చేసిన మంచి పనుల నుంచి కూడా తాను నేర్చుకోవాలని చూస్తానని చెప్పారు. అనుభవజ్ఞులైన విపక్ష నేతలు ఏదైనా నిర్మాణాత్మక విమర్శలు కానీ, సూచనలు కానీ చేస్తే తాము స్వాగతిస్తానని అన్నారు. దేశానికి మేలుచేసే ఆలోచనతో ముందుకు వస్తే మరీ మంచిదని చెప్పారు. ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన తనకు ఉండదన్నారు.
''పాత భావజాలానికి వదిలించుకోవాలి. 21వ శతాబ్దంలో భారతదేశ భవిష్యత్ నిర్మాణానికి ఎప్పుడో 18వ శతాబ్దంలో వాడుకలో ఉన్న సంప్రదాయాలు, చట్టాలు పనిచేయవు. రిఫార్మ్, పెర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ ద్వారా మార్పు తీసుకురావాలని నేను కోరుకుంటాను'' అని మోదీ చెప్పారు.
Lok Sabha Elections: పాలన పంజాబ్‌లో.. రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో...
మమత చెప్పింది నిజమే...
జూన్ 4 (ఎన్నికల ఫలితాల తేదీ)వ తేదీతో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వానికి గడువు తీరిపోతుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అడిగినప్పుడు, ఆమె నిజమే చెప్పారని మోదీ సమాధానమిచ్చారు. ''జూన్ 4వ తేదీతో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గడువు తీరిపోతుంది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ పదవీకాలం రాజ్యాంగపరంగా ముగియాల్సి ఉన్నప్పుడు దానిని రాజకీయం చేయకూడదు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. మేము ఏర్పాటు చేస్తాం'' అని మోదీ అన్నారు. ప్రభుత్వంపై ఏర్పాటుపై మరింత స్పష్టత ఇస్తూ...''నేను చెక్కుచెదరను. నేను కాశీ (వారణాసి) నుంచి వచ్చాను, కాశీ ఎప్పటికీ చెక్కుచెదరదు'' అని పరోక్షంగా తామే మరోసారి అధికారంలోకి వస్తామని మోదీ సంకేతాలిచ్చారు.
Read Latest News and National News here
Updated Date - May 24 , 2024 | 09:35 PM