Home » Interview
మీకు జనరేషన్ Z గురించి తెలుసా. రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువతను జనరేషన్ జడ్ అంటారు. వీరి గురించి ఓ సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఇండియా-పాక్ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని ఆశిస్తూ 2014లో ప్రధానమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ ఫరీఫ్‌ను కూడా ఆహ్వానించానని నరేంద్ర మోదీ చెప్పారు
మోదీ తనకు అత్యంత ఆప్త మిత్రుడని పలు సందర్భాల్లో ట్రంప్ ప్రశంసిస్తే, మోదీ సైతం ట్రంప్ పట్ల తనకున్న స్నేహభావాన్ని చాటుకున్నారు. అయితే ట్రంప్‌ను ఒక మిత్రుడిగా మోదీ ఎక్కువగా ఇష్టపడతారా? నాయకుడిగా ఇష్టపడతారా? ఓసారి చూద్దాం.
భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి పాల్గొన్నారు.
హీరో కొత్తవాడైనా, సూపర్‌స్టార్ రజనీకాంత్ అయినా... తన సిద్ధాంతాలకు అంగుళం కూడా పక్కకు జరగకుండా కథ నడిపించే విలక్షణ దర్శకుడు పా.రంజిత్. ‘తంగలాన్’తో సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన ఆయన ‘నవ్య’తో పంచుకున్న సినీ విశేషాలు...
సుమిత్ కుమార్.. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లా కలెక్టరుగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస సమీక్షలు, తనిఖీలు, పర్యటనలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా మీద ఓ అవగాహనకు వచ్చారు. ఇక్కడి అవసరాలు తెలుసుకున్నారు. వాటిని తీర్చేందుకు పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో ప్రాధాన్యాంశాలు.. జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు.. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టనున్న చర్యలపై కలెక్టరు సుమిత్ కుమార్ ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
విపక్ష నేతలను తాను ఎప్పుడూ శత్రువులుగా భావించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అందర్నీ కలుపుకుని వెళ్లాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విపక్షాల దాడులు, తన అభివృద్ధి సిద్ధాంతం, ప్రస్తుతం నడుస్తున్న లోక్‌సభ ఎన్నికలు సహా పలు అంశలపై ప్రధాని సమాధానమిచ్చారు.
ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పని చేయడమే తనకు తెలుసని.. ప్రజాసేవకే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. పదవుల కోసం, గుర్తింపు కోసం ఆలోచించనని.. తాను కార్యసాధకుడిని మాత్రమేనని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఇంతా కాదు! ఐదేళ్లు కంటి మీద సరిగా కునుకులేదు. నేను ఎన్‌ఎ్‌సజీ రక్షణలో ఉన్నా. అయినా నాఇంటిపైన డ్రోన్స్ ఎగరేశారు. ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు.
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..