Mamata Banerjee: ఓటు వేయకుండా తిరిగి వెళ్లకండి.. దీదీ 'సిటిజన్‌షిప్' వార్నింగ్
ABN, Publish Date - Apr 19 , 2024 | 05:47 PM
ఈద్ సెలబ్రేషన్స్ కోసం బెంగాల్ వచ్చిన వలస కార్మికులు ఓటు వేయకుండా మాత్రం తిరిగి వెళ్లవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. ముర్షీదాబాద్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం మాట్లాడుతూ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓటు వేయని వాళ్ల ఆధార్ కార్డులు, పౌరసత్వాన్ని ఊడ లాక్కుంటుందని హెచ్చరించారు.
కోల్‌కతా: ఈద్ సెలబ్రేషన్స్ కోసం బెంగాల్ వచ్చిన వలస కార్మికులు ఓటు వేయకుండా మాత్రం తిరిగి వెళ్లవద్దని పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విజ్ఞప్తి చేశారు. ముర్షీదాబాద్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం మాట్లాడుతూ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఓటు వేయని వాళ్ల (వలస కార్మికుల) ఆధార్ కార్డులు, పౌరసత్వాన్ని ఊడ లాక్కుంటుందని హెచ్చరించారు.
Lok Sabha elections 2024: తొలి దశ పోలింగ్.. డూడుల్ విడుదల చేసిన గూగుల్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారసభలో పునరుద్ఘాటించారు. సీఏఏను రాష్ట్రంలో అమలు కానీయమని, అసోంలో అమలు చేస్తే అనేక మంది చనిపోయారని అన్నారు. ''ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయం కూడా వాళ్లు (బీజేపీ) ఇప్పుడు మాట్లాడుతున్నారు. యూసీసీని తెస్తే ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరంతా మీ గుర్తింపును కోల్పోతారు'' అని మమతా బెనర్జీ చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని కూచ్‌బెహర్, జల్‌పాయ్‌గురి (ఎస్‌సీ), అలిపురుద్దూర్ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సీఎం తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
జాతీయ వార్తలు కోసం...
Updated Date - Apr 19 , 2024 | 05:47 PM