DRDO: స్వదేశీ విమాన ఇంజన్ ‘కావేరీ’ సిద్ధం!
ABN, Publish Date - Dec 26 , 2024 | 05:43 AM
గగనతల సాంకేతికతకు సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో డీఆర్‌డీవో కీలక మైలురాయిని దాటింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 25: గగనతల సాంకేతికతకు సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో డీఆర్‌డీవో కీలక మైలురాయిని దాటింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజన్ ప్రాజెక్టు ఒక కొలిక్కి వచ్చిందని, పరీక్షలకు కావేరీ ఇంజన్ సిద్ధమైందని ప్రకటించింది. డీఆర్‌డీఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లి్‌షమెంట్ ఈ ఇంజన్‌ను అభివృద్ధి చేసింది. యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలన్న లక్ష్యంతో కావేరీ ప్రాజెక్టు 1980ల చివర్లలో ప్రారంభమైంది.
ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. వాటన్నింటినీ అధిగమించి ఎట్టకేలకు స్వదేశీ విమాన ఇంజన్ రూపుదాల్చింది. తదుపరి దశలో భాగంగా కావేరీ ఇంజన్‌ను పలు విమానాల్లో, పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. వాటిలో కూడా విజయవంతమైతే విమాన ఇంజన్ల కోసం విదేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి తప్పుతుంది.
Updated Date - Dec 26 , 2024 | 05:43 AM