ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chhattisgarh: ఛత్తీ్‌సగఢ్‌లో ఎన్‌కౌంటర్‌..

ABN, Publish Date - May 11 , 2024 | 04:01 AM

లోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యంలో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పిడియా గుట్టల్లో కేంద్ర బలగాలు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.

  • 12 మంది మావోయిస్టుల మృతి

  • ఉదయం నుంచి సాయంత్రం దాకా కొనసాగిన కాల్పులు

  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

చర్ల, మే 10: లోక్‌సభ ఎన్నికల వేళ మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్యంలో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా పిడియా గుట్టల్లో కేంద్ర బలగాలు-మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. సుదీర్ఘంగా కాల్పులు జరగడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ఉన్నట్లు సమాచారం. ఛత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌లోని ఏడు జిల్లాల్లో ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇందులో భాగంగా గత 60 రోజుల్లో తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో 8 భారీ ఎన్‌కౌంటర్లు జరగా 98 మంది మావోయిస్టులు మృతిచెందారు. తాజాగా బీజాపూర్‌ జిల్లా గంగలూరు అడవుల్లోని పిడియా గుట్టల్లో బస్తర్‌ డివిజన్‌ మావోయిస్టు కమిటీ ముఖ్యనాయకుడు పాపారావు నేతృత్వంలో ధర్నా డివిజన్‌, పీఎల్‌జీవో (పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) బృందాలు గంగులూర్‌ ఏరియా కమిటీ సభ్యులు సుమారు 100 మంది సమావేశమైనట్లు బలగాలకు సమాచారం అందింది.


దంతెవాడ, సుకుమా, బీజాపూర్‌ జిల్లా చెందిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, కోబ్రా, సీఆర్‌ఫిఎఫ్‌ చెందిన సుమారు 1200 మంది బలగాలు శుక్రవారం పిడియా గుట్టల్లో కూంబింగ్‌ ప్రారంభించాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు చెందిన అధునాతన తుపాకులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నట్లు బస్తర్‌ ఐజీ కమలోచన్‌ కశ్యప్‌ మీడియాకు చెప్పారు. ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు.. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని హెలికాప్టర్‌లో బీజాపూర్‌ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా ఈ ఎన్‌కౌంటర్‌ 12 గంటల పాటు జరిగిందని.. ఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలను, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని ఛత్తీ్‌సగఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ తెలిపారు. కాగా బస్తర్‌ డివిజన్‌లోని దంతెవాడ, సుకుమా, బీజాపూర్‌ జిల్లాల్లో గత 60 రోజుల్లో ఇప్పటిదాకా 95 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పటిదాకా మావోయిస్టు పార్టీ వరుస ఎన్‌కౌంటర్లలో పార్టీ ముఖ్య నాయకులను, కమాండర్లను పార్టీ కోల్పోయింది. రూ.25 లక్షల నుంచి లక్ష రివార్డు ఉన్న పలువురు నాయకులు చనిపోయారు. వీరిలో రూ.25 లక్షల రివార్డు ఉన్న సాగర్‌, జోగన్న, రూ.10 లక్షల రివార్డు ఉన్న శంకర్‌రావు ఉన్నారు.

Updated Date - May 11 , 2024 | 04:01 AM

Advertising
Advertising