ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arvind Kejriwal: ప్రతి రక్తం బొట్టు దేశానికే... విడుదలైన వెంటనే ఫస్ట్ రియాక్షన్

ABN, Publish Date - Sep 13 , 2024 | 07:16 PM

లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.

న్యూఢిల్లీ: న్యాయం కోసం తన పోరాటం కొనసాగుతుందని, తన ఒంట్లోని ప్రతి రక్తం బొట్టు దేశం కోసమే వెచ్చిస్తానని ఢిల్లీ మఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.


''ఈరోజు నేను జైలు నుంచి బయటకు వచ్చాను. నా ధైర్యం 100 రెట్లు పెరిగింది. వాళ్ల జైలు గోడలు కేజ్రీవాల్ ధైర్యాన్ని సడలించలేకపోయాయి. దేశాన్ని బలహీన పరేచేందుకు, విభజించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై పోరాటాన్ని కొనసాగించడంతో పాటు సత్యమైన మార్గంలో కొనసాగేలా భగవంతుడు నన్ను ఆశీర్వదించాలని ప్రార్ధిస్తున్నాను" అని కేజ్రీవాల్ అన్నారు.

Kolkata Doctor Murder Case: రాష్ట్రపతి జోక్యం కోరుతూ జూనియర్ వైద్యులు లేఖ


దీనికి ముందు కేజ్రీవాల్‌కు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు చేయడం తప్పేమీ కాదని, అయితే న్యాయ ప్రక్రియలో సుదీర్ఘ కారాగారవాసం అంటే స్వేచ్ఛను హరించడమేనని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజురు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సంతకాలు చేయాలని, ట్రయిల్ కోర్టు విచారణకు హాజరవ్వాలని, సాక్ష్యాలను తారుమారుచేయరాదని, లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా సీఎం కార్యాలయానికి కానీ, సెక్రటేరియట్‌కు కానీ వెళ్లకూడదని, ఎల్జీ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకాలు చేయరాదని ఆదేశించింది.


Read MoreNational News and Latest Telugu New

Updated Date - Sep 13 , 2024 | 07:56 PM

Advertising
Advertising