Exit polls: ఎగ్జిట్ పోల్స్‌పై ప్రధాన ఎన్నికల కమిషనర్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 15 , 2024 | 06:17 PM
ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ప్రశ్నలు సంధించారు. శాంపిల్ సైజ్, సర్వేలు ఎక్కడ జరిగాయి? అందుకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ (Exit polls) శాస్త్రీయతపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) కీలక ప్రశ్నలు సంధించారు. శాంపిల్ సైజ్, సర్వేలు ఎక్కడ జరిగాయి? అందుకు అనుగుణంగా ఫలితాలు రాకుంటే బాధ్యులెవరు? అని ప్రశ్నించారు. దీనిపై భాగస్వామ్య పక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్బంగా ఆనయ ఈ కీలక వ్యాఖ్యల చేశారు.
Maharashtra, Jharkhand Elections: నవంబర్ 20న మహారాష్ట్ర, నవంబర్ 13, 20న జార్ఖాండ్ పోలింగ్
ఎగ్జిట్స్ పోల్స్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని, వాటికి ఎలాంటి శాస్త్రీయత లేనప్పటికీ భారీ అంచనాలనే సృష్టిస్తాయని చెప్పారు. ఇందువల్ల ప్రజల్లో గంగరగోళం ఏర్పడుతోందని, మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మపరిశీలన చేసుకోవాల్సి అవసరం ఉందని, స్వీయ నియంత్రణ అవసరమని సీఈసీ అన్నారు. ఓట్ల లెక్కింపు మొదలైన 15 నుంచి 30 నిమిషాల్లోనే టీవీ ఛానెల్స్ ఎర్లీ ట్రెండ్స్ చూపించడాన్ని సీఈసీ ప్రశ్నించారు.
''ఎన్నికలు ముగిసిన సుమారు మూడోరోజు కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 6 గంటల నుంచే అంచనాలు పెరుగుతుంటాయి. కౌంటింగ్ మొదలైన తర్వాత 8.05-8.10 గంటల మధ్యనే ఫలితాలు మొదలు పెట్టేస్తారు. ఇదంతా నాన్సెన్స్. ఫస్ట్ కౌంటింగ్ 8.30 గంటలకు మొదలవుతుంది. తొలి ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్‌ను జస్టిఫై చేస్తాయా?'' అని రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. ఉదయం 9.30 గంటలకు ఫలితాలు వెబ్‌సైట్‌లో పెట్టడం మొదలవుతుందని, వాస్తవ ఫలితాలు వచ్చేసరికి మిస్‌మ్యాచ్ కావచ్చని, ఒక్కోసారి ఇలాంటి మిస్‌మ్యాచ్ తీవ్ర సమస్యలకు కారణం కావచ్చని అన్నారు. అంచనాలు, ఫలితాలకు మధ్య అంతరం చివరకు నిరాశకు దారితీస్తుందన్నారు. దీనిపై మీడియా సహా సంబంధిత పార్టీలన్నీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఇటీవల ప్రకటించిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా రావడం, దీనిపై కొన్ని పార్టీలు ఆరోపణలు చేసిన నేపథ్యంలో రాజీవ్ కుమార్ తాజా వివరణ ఇచ్చారు.
For National News And Telugu News..
ఇది కూడా చదవండి..