ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Election Commission: అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు

ABN, Publish Date - Mar 17 , 2024 | 04:35 PM

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదివారంనాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్టు తెలిపింది.

న్యూఢిల్లీ: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) ఆదివారంనాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh), సిక్కిం (Sikkim) అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Counting) తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్టు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కిస్తామని ఈసీ ఇంతకుముందు ప్రకటించింది. కాగా, ఈసీ తాజాగా ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని అడ్వాన్స్ చేసి జూన్ 2న కౌంటింగ్ జరుపుతామని ప్రకటించింది. జూన్ 2వ తేదీతో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి ముగియనున్నందున కౌటింగ్ తేదీని అడ్వాన్ చేసినట్టు వివరణ ఇచ్చింది. అయితే, అరుణా‌చల్ ప్రదేశ్, సిక్కిం పార్లమెంటరీ నియోజకవర్గాల షెడ్యూల్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది.

Updated Date - Mar 17 , 2024 | 04:35 PM

Advertising
Advertising