ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

FEMA case: డీఎంకే ఎంపీకి ఈడీ రూ.908 కోట్ల జరిమానా

ABN, Publish Date - Aug 28 , 2024 | 05:56 PM

తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్.జగద్రక్షకన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది.

న్యూఢిల్లీ: తమిళనాడులోని అధికార డీఎంకే (DMK) పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు ఎస్.జగద్రక్షకన్ (S.Jagadrakshakan)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) షాక్ ఇచ్చింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజిమెంట్ యాక్ట్ (FEMA) కేసులో ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఫెమా చట్టంలోని సెక్షన్ 37ఏ కింద 2020 సెప్టెంబర్‌లో సీజ్ చేసిన రూ.89.19 కోట్ల మొత్తాన్ని కూడా జప్తు చేసినట్టు తెలిపింది. ఆగస్టు 26న వెల్లడించిన తీర్పు ప్రకారం ఈ జరిమానా విధించినట్టు ఈడీ తెలిపింది.

Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భద్రత పెంపు


ఎవరీ జగద్రక్షకన్..? ఈడీ కేసు ఏమిటి?

జగద్రక్షకన్ (76) డీఎంకే టిక్కెట్‌పై అరక్కోణం నుంచి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. చెన్నై బేస్ట్ అకార్డ్ గ్రూప్‌కు వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఆయనకు సొంతంగా భరత్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌‌ (BIHER) ఉంది. జగద్రక్షకన్, ఆయన కుటుంబ సభ్యులపై సంబంధిత కంపెనీపై ఫెమా ఉల్లంఘన కింద 2021 డిసెంబర్ 1న ఈడీ కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి 2017లో సింగపూర్‌లోని ఒక షెల్ కంపెనీలో రూ.42 కోట్లు వారు పెట్టుబడి పెట్టినట్టు ఈడీ విచారణలో తేలింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 28 , 2024 | 05:56 PM

Advertising
Advertising