ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra: రాజీనామా సమర్పణకు సీఎం రెడీ

ABN, Publish Date - Nov 25 , 2024 | 08:08 PM

మహారాష్ట్ర కొత్త సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారంటూ ఆయన వర్గం బలంగా చెబుతుండగా, మరోవైపు ఆయనపై ఉద్ధవ్ శివసేన వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన 'మహాయూతి' కూటమి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి ఎంపికపై కూటమి నేతల్లో ఓవైపు ఉత్కంఠ కొనసాగుతుండగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. షిండే ఉదయమే గవర్నర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని, కొత్త ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసేంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Aditya Thackeray: శివసేన (యూబీటీ) లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఆదిత్య థాకరే


ఫార్ములా లేదు...

కాగా, సీఎం పదవికి సంబంధించి ఏదైనా ఫార్ములా అనుకుంటున్నారా అనే ప్రశ్నపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారంనాడు స్పష్టత ఇచ్చారు. అలాంటి ఫార్ములా ఏదీ లేదని, మహాయుతి భాగస్వాములు సమష్టిగా సీఎం ఎవరనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈనెల 27వ తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుందంటూ వినిపిస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టివేశారు. మహాయుతి కూటమికి చాలా పెద్ద విజయాన్ని ప్రజలు అందించారని, పటిష్టమైన ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు.


షిండేజీ.. రాజకీయాల్లోంచి తప్పుకోండి

మహారాష్ట్ర కొత్త సీఎం రేసులో ఏక్‌నాథ్ షిండే ఉన్నారంటూ ఆయన వర్గం బలంగా చెబుతుండగా, మరోవైపు ఆయనపై ఉద్ధవ్ శివసేన వర్గం విమర్శలు ఎక్కుపెట్టింది. షిండే రాజకీయాల్లోంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. తనవర్గం (రెబల్ వర్గం) శివసేన ఎమ్మెల్యేలలో ఒక్కరు ఓడిపోయినా రాజకీయాల్లోంచి తప్పుకుంటానని ఏక్‌నాథ్ షిండే గతంలో చేసిన వాగ్దానాన్ని ఉద్ధవ్ శివసేన గుర్తు చేసింది. ఈమేరకు పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయం రాసింది. షిండే శివసేనకు చెందిన 40 ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు సదా సర్వాంకర్, యామిని జాదవ్, సాహజి బాపు పాటిల్, సంజయ్ రాయ్ ముల్కర్, జ్ఞానరాజ్ చౌగులే ఈ ఎన్నికల్లో ఓడిపోయినందున తక్షణమే రాజకీయాల నుంచి షిండే తప్పుకోవాలని డిమాండ్ చేసింది.


Supreme Court: రాజ్యాంగ పీఠిక అంశంపై సుప్రీం కీలక తీర్పు

Sambhal Violence: మసీదు సర్వే నేపథ్యంలో ఘర్షణ.. 20 మంది అరెస్ట్, స్కూల్స్, ఇంటర్నెట్ బంద్

Rahul: యూపీలోని సంభాల్ కాల్పుల ఘటనపై రాహుల్ ఏమన్నారంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 25 , 2024 | 08:11 PM