Jammu and Kashmir: అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు.. 8న ఈసీ పర్యటన
ABN, Publish Date - Aug 02 , 2024 | 09:20 PM
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ (Election commission) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, ఎస్ఎస్ సంధు ఇక్కడ పర్యటించనున్నారు.
కమిషన్ తొలుత రాజకీయ పార్టీలతో సమావేశమవుతుంది. సీఈవో, ఎస్‌పీఎన్ఓ, సెంట్రల్ ఫోర్సెస్ కోఆర్డినేటర్‌తోనూ సమీక్షా సమావేశాలు జరుపుతుంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జిల్లా ఎన్నికల అధికారులు, అన్ని జిల్లాల సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్‌లతోనూ కమిషన్ సమావేశమై ఎన్నికల సన్నాహకాలను సమీక్షిస్తుంది. ఆగస్టు 10న జమ్మూలో కమిషన్ పర్యటించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో సమీక్షా సమావేశం జరుపుతుంది. అనంతరం జమ్మూలో పాత్రికేయుల సమావేశంలో ఈసీ పాల్గొంటుంది.
Israel Indian Embasy advisory: భారత పౌరులకు ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వయిజరీ
కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందు గత మార్చిలోనూ సీఈసీ రాజీవ్ కుమార్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. యూటీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని జమ్మూకశ్మీర్ ప్రజలకు, రాజకీయ పార్టీలకు హామీ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు రికార్డు స్థాయిలో ఓటుహక్కును వినియోగించుకోవడంపై కూడా కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30వ తేదీ గడువు లోగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు సైతం ఈసీ ఇచ్చింది.
For Latest News and National News Click Here
Updated Date - Aug 02 , 2024 | 09:20 PM