ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elephant: బుల్లెట్‌ ఏనుగుకు మత్తు ఇంజక్షన్‌..

ABN, Publish Date - Dec 27 , 2024 | 10:45 AM

నీలగిరి(Neelagiri) జిల్లా పందలూరు, పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న ‘బుల్లెట్‌’ అనే ఏనుగు(Elephant)ను మత్తు ఇంజక్షన్‌ వినియోగించి బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తు న్నారు.

- అటవీ శాఖ నిర్ణయం

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా పందలూరు, పరిసర ప్రాంతాల్లో ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న ‘బుల్లెట్‌’ అనే ఏనుగు(Elephant)ను మత్తు ఇంజక్షన్‌ వినియోగించి బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తు న్నారు. నీలగిరి జిల్లా పందలూరు పరిసర ప్రాంతాల్లో 35 ఏనుగుల గుంపు మకాం వేసింది. వాటిలో బుల్లెట్‌ అనే ఏనుగు జనావాస ప్రాంతాల్లో ప్రవేశించి, ఇళ్లు, దుకాణాల్లో ఉన్న బియ్యం సహా ఆహార పదార్ధాలు తీసుకెళ్తోంది.

ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: మళ్లీ అధికారమే లక్ష్యం.. 200కు పైగా స్థానాల్లో విజయం


రెండు నెలలుగా ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపై కూడా ఏనుగు దాడిచేసిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం 40 ఇళ్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో, అటవీ శాఖ అధికారులు గుంకీ ఏనుగు(Gunky elephant)ను రప్పించి దాని సాయంతో బుల్లెట్‌ ఏనుగును అడవిలోకి పంపే ప్రయత్నాలు చేపట్టారు. ఇంతలో గురువారం వేకువజామున 2 గంటలకు టాన్‌టీ క్వార్టర్స్‌లో ప్రవేశించిన ఏనుగు, తవమణి, జ్ఞానశేఖర్‌కు చెందిన ఇళ్లను ధ్వంసం చేసింది.


ఇంట్లో ఉన్న వారు వెనుక తలుపు మార్గంగా బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ నేపథ్యంలో, బుల్లెట్‌ ఏనుగుకు మత్తు ఇంజక్షన్‌ వేయాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఏనుగు సామియార్‌మలై ప్రాంతంలో ఉందని, దానిని బయటకు తీసుకొచ్చే చర్యలు చేపట్టినట్లు రేంజర్‌ వెంకటేష్‌ ప్రభు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్‌

ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..

ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2024 | 10:46 AM