ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్‌ దేబ్‌రాయ్‌ కన్నుమూత

ABN, Publish Date - Nov 02 , 2024 | 02:51 AM

ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ బిబేక్‌ దేబ్‌రాయ్‌ (69) శుక్రవారం కన్నుమూశారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, గుండె సమస్యలతో గురువారం చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చేరారు.

  • తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని

  • ఆయన సిఫార్సుతోనే సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ విలీనం

న్యూఢిల్లీ, నవంబరు 1: ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ బిబేక్‌ దేబ్‌రాయ్‌ (69) శుక్రవారం కన్నుమూశారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, గుండె సమస్యలతో గురువారం చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయన చేరారు. చికిత్స కొనసాగుతుండగానే.. పేగుల్లో సమస్య తలెత్తి పరిస్థితి విషమించి ఆయన మరణించారు. బిబేక్‌ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో దేశం ఒక ప్రజామేధావిని కోల్పోయిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత వంటి పలు రంగాల్లో నైపుణ్యం కలిగిన శిఖర సమాన మేధావి డాక్టర్‌ బిబేక్‌ దేబ్‌రాయ్‌ జీ. తన రచనలు, కృషి ద్వారా భారత మేధోరంగంపై చెరిగిపోని ముద్ర వేశారు’ అని గుర్తు చేసుకున్నారు. బిబేక్‌ దేబ్‌రాయ్‌ 2017 నుంచి ప్రధాని ఆర్థిక సలహా మండలికి నేతృత్వం వహిస్తున్నారు. అమృత్‌కాల్‌ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి కూడా ఆయన సారథ్యం వహించారు.


2015 నుంచి 2019 వరకూ నీతిఆయోగ్‌లో సభ్యుడిగా ఉన్నారు. దేబ్‌రాయ్‌ కమిటీ సిఫార్సుల మేరకే.. కేంద్రం రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని పక్కనపెట్టి 2017-18 నుంచి సాధారణ బడ్జెట్‌తోపాటే రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టటం ప్రారంభించింది. ఆర్థికశాస్త్రం, రైల్వేలు, న్యాయశాస్త్రం, తత్వశాస్త్రం తదితర రంగాలపై బిబేక్‌ పలు రచనలు చేశారు. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలతోపాటు వాల్మీకి రామాయణాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లి్‌షలోకి అనువదించారు. తాజాగా మహాభారతం అనువాదాన్ని పది సంపుటాలుగా వెలువరించారు. మరణానికి 4 రోజుల ముందు ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌సకు బిబేక్‌ దేబ్‌రాయ్‌ ఒక వ్యాసం రాయటం విశేషం. 2015లో బిబేక్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది.

Updated Date - Nov 02 , 2024 | 02:51 AM