ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gujarat: కోటలోనే ఉండే చక్రవర్తి మోదీ..

ABN, Publish Date - May 05 , 2024 | 04:15 AM

కాంగ్రెస్‌ నేత, తన సోదరుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ‘యువరాజు’ అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా పట్ల కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన జవాబిచ్చారు.

ఆయన ప్రజలకు ఎప్పుడో దూరమయ్యారు: ప్రియాంక గాంధీ

లఖానీ (గుజరాత్‌), మే 4: కాంగ్రెస్‌ నేత, తన సోదరుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి ‘యువరాజు’ అంటూ ప్రధాని మోదీ ఎద్దేవా పట్ల కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా ధీటైన జవాబిచ్చారు. ప్రధాని మోదీ తన సోదరుడిని యువరాజు అంటున్నారని, అయితే ఈ యువరాజే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 4వేల కిలో మీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను విన్నారని చెప్పారు. మోదీని ప్యాలె్‌సలో ఉండే చక్రవర్తి అన్న ప్రియాంక.. ఆయన ఏనాడో ప్రజలకు దూరమయ్యారని విమర్శించారు.


అధికారం కోసం గుజరాత్‌ ప్రజలను వాడుకుని, తర్వాత వారిని మరచిపోయారని ఆమె అన్నారు. శనివారం గుజరాత్‌లోని బనస్కాంత లోక్‌సభ నియోజకవర్గంలోని లఖానీ వద్ద కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ప్యాలె్‌సలో ఉంటారు. ఆయనను ఎప్పుడైనా టీవీలో చూశారా? ఆయన దుస్తులు చాలా శుభ్రంగా, వెంట్రుకలు చెక్కుచెదరకుండా ఉంటాయి. మీ కష్టాలు, ద్రవ్యోల్బణంతో మీపై అధిక భారం పడేది ఆయన ఎలా అర్థం చేసుకుంటారు?’’ అని ఆమె అన్నారు.


రాహుల్‌ గాంధీని భారత్‌కు తదుపరి ప్రధానిని చేయాలని పాకిస్థాన్‌ తహతహలాడుతోందని, కాంగ్రెస్‌ అధికారం కట్టబెడితే మంగళసూత్రాలు, ఆభరణాలు దోచుకునేందుకు ఎక్స్‌రే మిషన్లను వాడతారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యల పట్ల ప్రియాంక మండిపడ్డారు. భారత్‌లో ఎన్నికలు జరుగుతుంటూ పాకిస్థాన్‌ గురించి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ 55 ఏళ్లు అధికారంలో ఉందని, ఎక్స్‌-రే మిషన్‌ను ఉపయోగించి ఎప్పుడైనా గేదెలు, ఆభరణాలను దొంగిలించిందా.. అని ఆమె ప్రశ్నించారు.


దేశ ప్రధాని హోదాలో ఉండి ఆయన దిగజారి మాట్లాడుతున్నారన్నారు. రైతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం అమూల్‌, బనాస్‌ డెయిరీ వంటి కోఆపరేటివ్‌ రంగాలను ఏర్పాటు చేసిందని, ఇప్పుడు బీజేపీ నేతలు ఆ రంగాన్ని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - May 05 , 2024 | 04:36 AM

Advertising
Advertising