ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ranchi: కేజ్రీవాల్, సోరెన్ పేర్లతో ఖాళీ కుర్చీలు.. ఇండియా కూటమి వినూత్న నిరసన

ABN, Publish Date - Apr 21 , 2024 | 06:11 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

రాంచీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Soren) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు.

ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ర్యాలీలో కేజ్రీవాల్, సోరెన్‌లకు ప్రత్యేకంగా కుర్చీలు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. 'ఉలు‌గులన్ న్యాయ్ మహరల్లీ' పేరుతో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ర్యాలీ నిర్వహించింది. 'ఉలుగులన్' అంటే విప్లవం అని అర్థం. గిరిజనుల హక్కుల కోసం బ్రిటీష్ వారిపై బిర్సా ముండా చేసిన పోరాటంలో ఈ పదం ఉద్భవించింది.


ఇందులో పాల్గొన్న జేఎంఎం కార్యకర్తలు సోరెన్ మాస్క్‌లు ధరించి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోరెన్‌ను జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) భూకుంభకోణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసింది. మార్చి 21న ఈడీ ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది.

వారి అరెస్టుకు వ్యతిరేకంగా.. "జైలు కా తాలా తూటేగా, హేమంత్ సోరెన్ చుటేగా" (జైలు తాళం పగలగొడతాం. హేమంత్ సోరెన్‌ను విడుదల చేస్తారు), "జార్ఖండ్ జుకేగా నహీ" (జార్ఖండ్ తలవంచదు)" వంటి నినాదాలు చేశారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 06:11 PM

Advertising
Advertising