ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:29 AM

తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

  • కొత్త ప్రాజెక్టుల కోసం రైల్వే మంత్రిని కలిశాం

  • మీడియాతో మల్కాజిగిరి ఎంపీ ఈటల

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు, ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణం తదితర సమస్యలు పరిష్కరించాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావుతో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశానని తెలిపారు.

మౌలాలి నుంచి సనత్‌ నగర్‌, సిక్రింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ మార్గాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

జిగ్‌జాగ్‌ రైల్వే లైన్ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న బొల్లారం, వాజ్‌పేయి నగర్‌, అల్వాల్‌, వెంకటాపూర్‌, షఫిల్‌గూడ ఏరియాల్లో ఆర్వోబీలు నిర్మించాలని కోరారు.

రాష్ట్రం సహకరించకున్నా ఆర్వోబీలు నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. మౌలాలి - చర్లపల్లి - సనత్‌ నగర్‌ ఏరియాల్లో ప్రజలకు అవసరం ఉన్నచోట ఎంఎంటీఎస్‌ స్ట్టేషన్లు ఏర్పాటు చేయాలని, సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌, జూబ్లీ బస్టాండ్‌ నుంచి శామీర్‌పేట్‌, ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు కేంద్ర ప్రభుత్వ డబ్బులతోనే ఎక్స్‌ ప్రెస్‌ హైవేల నిర్మాణం చేయాలని కోరినట్లు ఈటల తెలిపారు.

Updated Date - Aug 02 , 2024 | 04:29 AM

Advertising
Advertising
<