ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jaipur: బీజేపీ ఆ విషయంలో వెనకడుగేయదు.. అమిత్ షా స్పష్టీకరణ

ABN, Publish Date - Apr 20 , 2024 | 06:25 PM

కాంగ్రెస్ పార్టీ వెనకబడిన తరగతులకు వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఆరోపించారు. రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో షా ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను విపక్షాలు తొలగించాలని కోరుతున్నప్పటికీ.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో వాటిని తొలగించదన్నారు.

జైపూర్: కాంగ్రెస్ పార్టీ వెనకబడిన తరగతులకు వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఆరోపించారు. రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో షా ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను విపక్షాలు తొలగించాలని కోరుతున్నప్పటికీ.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో వాటిని తొలగించదన్నారు.


"ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ వర్గానికి చెందినవారు. వెనుకబడిన తరగతుల కోసం బీజేపీ అనేక పథకాలు అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ కోరినా.. మేం అలా చేయం. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ వెనుకబడిన తరగతులను (ఓబీసీ) వ్యతిరేకించే పార్టీ. అప్పటి యూపీఏ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలేదు. రిజర్వేషన్లపై పార్లమెంటులో చర్చ సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రెండున్నర గంటల పాటు దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వెనుకబడిన కమిషన్‌కు రాజ్యాంగ గుర్తింపు కల్పించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ప్రతి మూడు నెలలకోసారి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తారు. ప్రియాంక గాంధీ ఎన్నికలున్నాయనే కారణంతో థాయ్‌లాండ్ నుంచి తిరిగి వచ్చారు. వారికి దేశ ప్రజలపై ప్రేమ ఎక్కడిది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు చొరబడి దాడులు చేసేవారు. బీజేపీ హయాంలో ఒక్క ఉగ్రదాడి జరిగిన దాఖలాలు లేవు. దేశంలోని అన్ని కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషిచేశాం. ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని మోదీ పెంచారు. మా హయాంలో కమ్మరి, టైలర్లు, వడ్రంగులు, పడవలు తయారు చేసే వారు.. ఇతర చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు రూ.13,000 కోట్లు వెచ్చించి నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలతో అనుసంధానం చేశాం. గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. ఈవీఎంపై కమలం గుర్తు బటన్‌ను గట్టిగా నొక్కండి. తద్వారా ఇటలీలో షాక్‌లు ఉద్భవించాలి. రాజస్థాన్‌లో బీజేపీ 25 సీట్లు సాధించబోతోంది. మేం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయి" అని షా పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 20 , 2024 | 06:29 PM

Advertising
Advertising