Ballot Paper voting: మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఓడితే ట్యాంపరింగా?: కేఏ పాల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
ABN , Publish Date - Nov 26 , 2024 | 05:30 PM
బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంచినట్టు తేలిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని, ఎన్నికల అవకతవకలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానం రూపొందించాలని కేఏ పాల్ కోర్టుకు తాన వాదన వినిపించారు.
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (EVMs) స్థానే తిరిగి పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌ను తీసుకురావాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ (KA Paul) దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు (Supreme Corut) మంగళవారంనాడు కొట్టివేసింది. ''మీరు గెలిస్తే ఈవీఎంలు మంచివి, ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని అంటారు. ఓడిపోతే మాత్రం ఈవీఎంల ట్యాపరింగ్ జరిగిందని అంటారు'' అని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, పీబీ వరలేతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను నిలదీసింది.
Ramdas Athawale: షిండే హ్యాపీగా లేరు.. కేంద్ర మంత్రి వెల్లడి
బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి తీసుకురావాలని, ఓటర్లకు డబ్బులు, మద్యం పంచినట్టు తేలిన అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని, ఎన్నికల అవకతవకలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానం రూపొందించాలని కేఏ పాల్ కోర్టుకు తాన వాదన వినిపించారు. పలు విదేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ ఓటింగ్ విధానాన్ని అనుసరస్తు్న్నారని అన్నారు. ఎన్నికల సమయంలో దేశంలో వేల కోట్ల అవినీతి కూడా జరుగుతోందన్నారు.
దీనిపై ధర్మాసనం తిరిగి కేఏ పాల్‌ను నిలదీసింది. మిగతా ప్రపంచంలో బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్నంత మాత్రాన మీరెందుకు భిన్నంగా ఉండాలని కోరుకోవడం లేదు? బ్యాలెట్ విధానాన్ని అనుసరించినంత మాత్రాన అవినీతి ఆగిపోతుందని అనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం లెవనెత్తుతున్న సమస్యలకు బ్యాలెట్ పేపర్ల ఓటింగ్ సమర్ధవంతమైన, ఆచరణకు యోగ్యమైన పరిష్కారం కాదని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇవి కూడా చదవండి..
Maharashtra: 'మహా' సర్కార్ ప్రమాణస్వీకారం ముహూర్తం ఇదేనట
President Droupadi Murmu: ప్రత్యక్ష, ప్రగతిశీల పత్రమే.. ‘‘రాజ్యాంగం’’
Dy CM: మళ్లీ ద్రావిడ పాలన కోసం పాటుపడండి..
Read More National News and Latest Telugu News