Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు
ABN, Publish Date - Dec 22 , 2024 | 12:19 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్రమైయ్యాయి. ఆ క్రమంలో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు అనే తేడా లేకుండా అన్నింటికి బాంబు బెదిరింపులు వెల్లువెత్తుతోన్నాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పరీక్షలంటేనే టెన్షన్. పైగా ఏం ప్రిపేరు కాలేదు. దీంతో పరీక్షలు వాయిదా వేయించేందుకు విద్యార్థులు స్కెచ్ వేశారు. అందులోభాగంగా తాము చదువుతోన్న పాఠశాలలకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో ఈ మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను వారు కనుగొన్నారు.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు
తద్వారా ఈ కేసును ఛేదించారు. పరీక్షలు వాయిదా వేయించేందుకు ఇద్దరు విద్యా్ర్థులు వేర్వేరుగా ఈ బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు.. తమ దర్యాప్తులో గుర్తించారు. దీంతో సదరు విద్యార్థులను అదుపులోకి తీసుకొని.. కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం వారిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా సదరు విద్యార్థుల తల్లిదండ్రులను సైతం పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. బాంబు బెదిరింపులకు పాల్పడిన ఈ విద్యార్థులు సోదరులని పోలీసులు వెల్లడించారు.
Also Read: జర్మనీలో దాడి.. పలువురి మృతి, ఏడుగురు భారతీయులకు గాయాలు
నవంబర్ మాసాంతంలో రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్‌లో గల పీవీఆర్ మల్టీ ప్లెక్స్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ మరునాడే నగరంలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వెల్లువెత్తాయి. అలా బాంబు బెదిరింపులు వచ్చిన స్కూళ్ల జాబితాలో.. వెంకటేశ్వర గ్లోబల్ స్కూల్ సైతం ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ క్రమంలో ఈ బాంబు బెదిరింపు నకిలీదని వాళ్లు తేల్చారు. అందులోభాగంగా ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా ఈ కేసును ఛేదించారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి
ఇటీవల మూడు పాఠశాలలకు ఇ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు అందాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత 11 రోజులుగా ఢిల్లీలోని 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు కాల్స్, ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినా.. ఈ కేసుల్లో ముందుకు వెళ్లడం.. పోలీసులకు కష్ట సాధ్యంగా మారింది.
అయితే ఈ ఏడాది మే నుంచి దాదాపు 50కిపైగా బాంబు బెదిరింపులు.. ఇమెయిల్ ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు, ఎయిర్ పోర్టుకు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఎయిర్ పోర్టులే లక్ష్యంగా చేసుకొని.. ఈ బాంబు బెదిరింపులు వస్తున్నాయి.
For National News And Telugu News
Updated Date - Dec 22 , 2024 | 12:25 PM