ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Excise Case: జూన్ 5 వరకూ జ్యుడిషియల్ కస్టడీకి కేజ్రీవాల్

ABN, Publish Date - Jun 02 , 2024 | 07:15 PM

ఎక్సైజ్ పాలసీ కేసు నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహారు జైలు అధికారులకు లొంగిపోయారు. వెంటనే ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వార్ ముందు హాజరుపరిచారు. ఈనెల 5వ తేదీ వరకూ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది.

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు తీరడంతో ఎక్సైజ్ పాలసీ (Excise Policy Case) కేసు నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆదివారం సాయంత్రం తీహారు జైలు అధికారులకు లొంగిపోయారు. వెంటనే ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వార్ ముందు హాజరుపరిచారు. ఈనెల 5వ తేదీ వరకూ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది. వైద్య కారణాల రీత్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ఇటీవల వేసిన పిటిషన్‌పై తీర్పును ఈనెల 5వ తేదీకి గత శనివారంనాడు కోర్టు రిజర్వ్ చేసింది.

Arvind Kejriwal: తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్న కేజ్రీవాల్


సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈనెల 2న లొంగిపోవాల్సిన కేజ్రీవాల్ వైద్య పరీక్షల పేరుతో తిరిగి బెయిల్ పిటిషన్ వేయడంపై వాదనల సందర్భంగా ఈడీ అభ్యంతరం తెలిపింది. వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్న కేజ్రీవాల్ ఓ గంటపాటు వైద్యపరీక్షలకు వెళ్లకుండా దేశమంతా తిరిగుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చింది. తీర్పును కోర్టు రిజర్వ్ చేయడంతో కేజ్రీవాల్ ఆదివారంనాడు తిరిగి తీహార్ జైలు అధికారులకు లొంగిపోయారు. కాగా, రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ వేసిన మరో పిటిషన్ జూన్ 7న విచారణకు రానుంది.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 07:15 PM

Advertising
Advertising