Exit poll Results: 'ఎగ్టిట్ పోల్స్' నవ్వుపుట్టిస్తున్నాయి.. మా లెక్క 295
ABN, Publish Date - Jun 03 , 2024 | 05:44 PM
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిధరూర్ పెదవి విరిచారు. ఎగ్జిట్ పోల్స్ ఓ 'ప్రహసనం' అని అన్నారు.
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం అభ్యర్థి శశిధరూర్ (Shashi Tharoor) పెదవి విరిచారు. ఎగ్జిట్ పోల్స్ ఓ 'ప్రహసనం' (Laughable) అని అన్నారు.
"ఎగ్జిట్ పోల్ ఫలితాలను మేము నమ్మడం లేదు. ఎందుకంటే మేము కూడా దేశవ్యాప్తంగా తిరిగి ప్రచారం సాగించాం. ప్రజల నాడి మాకు కూడా తెలుసు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రజల నాడిని ప్రతిబింబించేలా లేవు. ఇండియా కూటమి నేతల సమావేశం తర్వాత మాకు 295 సీట్లు రాబోతున్నాయనే నిశ్చితాభిప్రాయానికి మా పార్టీ అధ్యక్షుడు వచ్చారు. ఆ సంఖ్యకు నేను కట్టుబడి ఉన్నాను'' అని శశిథరూర్ తెలిపారు.
ఎండదెబ్బ తగిలి...
''కేరళలో బీజేపీ 7 సీట్లు వరకూ గెలుస్తుందని ఏ ఎగ్జిట్ పోల్ అయినా చెబితే వారికి ఎండదెబ్బ తగిలైనా ఉండాలి, కేరళ గురించి తెలియకపోవడమైనా అయిండాలి. ఇతర విషయాల పరంగా చూసినా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూసి నవ్వుకోవచ్చు. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు'' అని శశిథరూర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దేశమంతటా ప్రచారం చేసిందని, ఎక్కడా బీజేపీ గాలి కనిపించలేదని తెలిపారు.
Lok Sabha Elction results: కౌంటింగ్ వేళ.. నడ్డా నివాసంలో బీజేపీ కీలక సమావేశం
తిరువనంతపురంలో బీజేపీకి రెండో ప్లేసే..
బీజేపీకి తిరువనంతపురం గట్టి పట్టున్న నియోజకవర్గమని తనకు తెలుసునని, అయితే రెండు సందర్భాల్లో వాళ్లు రెండో స్థానంలో నిలిచారని, ఈసారి కూడా రెండో స్థానం నిలబెట్టుకుంటారని శశిథరూర్ చెప్పారు. ఒక్క తిరువనంతపురం మాత్రమే కాదు, ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పిన సంఖ్యలు కూడా తప్పని మంగళవారంనాడు వెలువడే ఫలితాలే రుజువు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము చాలా రిలాక్స్‌డ్‌గా మంగళవారంనాడు జరిగే కౌంటింగ్‌కు వెళ్తున్నామని నవ్వుతూ చెప్పారు.
For Latest News and National News click here
Updated Date - Jun 03 , 2024 | 05:44 PM