ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fatehpur : యూపీ యువకుడిపై పాముల పగ.. 7 సార్లు కాట్లు

ABN, Publish Date - Jul 14 , 2024 | 04:12 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఓ యువకుడిని పాములు ఏడుసార్లు కాటువేశాయి. వీటిలో ఆరుసార్లు శనివారం నాడే.. ఇదంతా నలభై రోజుల వ్యవధిలో జరిగింది. ప్రతిసారీ కోలుకున్న అతడు..

ఫతేపూర్‌, జూలై 13: ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌లో ఓ యువకుడిని పాములు ఏడుసార్లు కాటువేశాయి. వీటిలో ఆరుసార్లు శనివారం నాడే.. ఇదంతా నలభై రోజుల వ్యవధిలో జరిగింది. ప్రతిసారీ కోలుకున్న అతడు..

ఇటీవల తన కలలోకి పాము వచ్చిందని, మరో రెండుసార్లు కూడా కాటేస్తానని, తర్వాత మాత్రం ప్రాణాలు దక్కవని అది చెప్పిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. సౌరా గ్రామానికి చెందిన అతడి పేరు వికాస్‌ దూబే (24). మంచం దిగుతుందగా జూన్‌ 2న తొలిసారి ఇతడిని పాము కరిచింది. ఈ నెల 6వ తేదీ నాటికి ఆరుసార్లు కరిచాయి.

తాజాగా మరోసారి బంధువు ఇంటి వద్ద కాటుకు గురయ్యాడు. ప్రతిసారీ ఘటనకు మూడు-నాలుగు గంటల ముందు తనకు పాము కరవబోతుందనే సంకేతాలు వస్తున్నట్లు దూబె చెప్పాడు. పదేపదే ఆస్పత్రి పాలవడంతో తన ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని అధికారులకు మొరపెట్టుకున్నాడు. కాగా, దూబెను ఇన్నిసార్లు పాము కరవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవాలు తేల్చాలని ముగ్గురు వైద్యులతో కమిటీ వేశారు.

Updated Date - Jul 14 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<