ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Fengal Cyclone Alert: భారీ తుపాను హెచ్చరిక.. స్కూళ్లు, కాలేజీలు బంద్..

ABN, Publish Date - Nov 27 , 2024 | 07:24 AM

దేశానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. దీంతోపాటు గత 18 గంటలుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Fengal Cyclone alert tamil Nadu

మరో సైక్లోనిక్ ఫెంగల్ తుఫాను (Fengal Cyclone Alert) దేశాన్ని తాకబోతోంది. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ హెచ్చరించింది. ఈ క్రమంలో కోస్తా రాష్ట్రాల్లో ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించారు. దీంతోపాటు ఈదురు గాలులు కూడా బీభత్సం సృష్టిస్తాయని వెల్లడించారు. తుపాను నేపథ్యంలో నేడు తమిళనాడు(Tamil Nadu)లో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. భారీ వర్షాల కారణంగా చెన్నై ప్రాంతీయ మెట్రోలాజికల్ సెంటర్ (RMC) హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచుతో పాటు చలి కూడా పెరగవచ్చని వెదర్ రిపోర్ట్ తెలిపింది.


ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఈ నేపథ్యంలో నవంబర్ 27 నుంచి 28 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌లోని 4వ బెటాలియన్‌కు చెందిన 7 బృందాలు తీరప్రాంతాల్లో మోహరించాయి. కారైకాల్, తంజావూరు, తిరువారూరు, కడలూరు, నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లో బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఎన్‌డీఆర్‌ఎఫ్ తెలిపింది.


అనేక ఇబ్బందులు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని ఆర్‌ఎంసీ చెన్నై అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం తుపానుగా మారనుందన్నారు. ఈ ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి చెన్నైతోపాటు దాని పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రోడ్లు మొత్తం జలమయంగా మారాయి. దీంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తుపాను ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 27న రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.


ఈ జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు బంద్

దీంతో నవంబర్ 27 నుంచి 29 వరకు చెన్నైలో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, నవంబర్ 27 నుంచి 30 వరకు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టుతో సహా పొరుగు జిల్లాలలో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని చెన్నై, నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్‌తో సహా 9 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లోని పలు ప్రాంతాలలో నవంబర్ 27న ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురియనున్నాయి. కోస్తా తమిళనాడులో నవంబర్ 28న కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 27 , 2024 | 07:25 AM