Haryana: కాంగ్రెస్ అభ్యర్థి కాన్వాయ్‌పై దాడి, కాల్పుల్లో గాయపడిన కార్యకర్త
ABN, Publish Date - Sep 20 , 2024 | 06:48 PM
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కల్కా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు.
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కల్కా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ చౌదరి (Pradeep Chaudhary) కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం సాయంత్రం దాడి చేశారు. కాల్పులకు తెగబడ్డారు. రాయపూర్ రానీ ప్రాంతంలోని భరౌలి గ్రామంలో ఈ దాడి జరిగింది. ఈ సమయంలో బైక్‌పై ఉన్న చౌదరి మద్దతుదారుడికి రెండు బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాన్వాయ్‌లోని ఆ వ్యక్తిని గోల్డీ ఖేరిగా గుర్తించారు.
Amit Shah: ఒక్క చొరబాటుదారుని కూడా ఉపేక్షించం: అమిత్‌షా
తొక్కిసలాట..
కల్కా నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రదీప్ చౌదరి ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన కాన్వాయ్ వెళ్తుండగా కాల్పులు ఘటన చోటుచేసుకోవడంతో ఘటనా ప్రాంతంలో ఒక్కసారిగా తొక్కిసలాట పరిస్థితి నెలకొంది. వెంటనే అంబులెన్స్ రప్పించి బుల్లెట్ గాయమైన గోల్డీ ఖేరిని ఆసుపత్రికి తరలించారు. అగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, కాల్పుల్లో గాయపడిన గోల్డీకి నేర కార్యక్రమాలతో సంబంధాలున్నాయని, గ్యాంగ్‌ల మధ్య గొడవలే ఈ కాల్పులకు కారణం కావచ్చని అనుమానిస్తున్నారు.
Read MoreNational News and Latest Telugu News
Also Read:CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌కు వరద పోటు.. జార్ఖండ్
Updated Date - Sep 20 , 2024 | 06:48 PM