ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

India Alliance's Appeal to ECI: తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించండి

ABN, Publish Date - Jun 03 , 2024 | 05:43 AM

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు భారత ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ) కలిశాయి. మంగళవారం కౌంటింగ్‌లో తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరిగాకే.. ఈవీఎంలను తెరవాలని ఇండియా కూటమి కోరింది.

  • ఈసీఐకి విపక్ష ఇండియా కూటమి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు భారత ఎన్నికల సంఘాన్ని(ఈసీఐ) కలిశాయి. మంగళవారం కౌంటింగ్‌లో తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు జరిగాకే.. ఈవీఎంలను తెరవాలని ఇండియా కూటమి కోరింది.

ఈసీఐని కలిసిన 13 మంది ఇండియా కూటమి నేతల్లో కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్‌పవార్‌, ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ తదితరులున్నారు. ‘‘ఈసారి వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసేలా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో పోస్టల్‌ ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

అందుకే.. తొలుత వాటిని లెక్కించాలి’’ అని కోరుతూ వారు ఈసీఐకి రెండు వినతిపత్రాలు సమర్పించారు. కాగా.. ఇండియా కూటమి నేతలు ఈసీఐని కలిసి వెళ్లిన కొద్దిసేపటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ నేతృత్వంలోని కేంద్రమంత్రి పీయూ్‌షగోయల్‌ తదితరుల బృందం ఎన్నికల కమిషన్‌ను కలిసింది. ‘‘కొన్ని శక్తులు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ కుట్రలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

ఎన్నికల ప్రొటోకాల్‌ను పకడ్బందీగా పాటించాలి. ఫలితాల వెల్లడి సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలి’’ అని మంత్రుల బృందం కోరింది.

Updated Date - Jun 03 , 2024 | 05:43 AM

Advertising
Advertising