Mpox: దేశంలో ఫస్ట్ మంకీపాక్స్ అనుమానిత కేసు.. అప్రమత్తం చేసిన కేంద్రం
ABN, Publish Date - Sep 08 , 2024 | 08:33 PM
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ కేసు ఇప్పుడు భారత్ కూడా వచ్చేసింది. ఇటీవల మంకీపాక్స్ సోకిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.
ఇటివల గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వెలుగులోకి వచ్చిన మంకీపాక్స్ కేసు ఇప్పుడు భారత్ కూడా వచ్చేసింది. ఇటీవల మంకీపాక్స్ సోకిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. రోగిని ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. ఆ వ్యక్తి నమూనాను సేకరించి, మంకీపాక్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించేందుకు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసు మూలాలను గుర్తించడానికి, దేశంలోని మరిన్ని ప్రాతాల్లో అంచనా వేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
వివరాలు మాత్రం
అయితే ఆ వ్యక్తి విదేశాల నుంచి తిరిగి వచ్చిన క్రమంలో జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. కానీ అనుమానిత రోగి వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకోలేదు. అనుమానిత రోగి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అతన్ని ఐసోలేషన్‌లో ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగిని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పేషెంట్ శాంపిల్స్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఏదో ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం అతనితో పరిచయం ఉన్న వ్యక్తులను విచారిస్తున్నారు. మంకీ పాక్స్ మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ప్రభావితమైంది. కాంగోలో ఇప్పటివరకు దాదాపు 18 వేల మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి.
సిద్ధం
ఈ నేపథ్యంలో ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపింది. కోతుల నుంచి వచ్చే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్టమైన, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాదు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేసింది.
మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది?
ఈ వ్యాధి సోకిన వ్యక్తి లేదా వస్తువు నుంచి వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ ఇది. దీని వల్ల శరీరంపై దద్దుర్లు, చలి జ్వరం, అలసట, నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం దీనిని నివారించడానికి మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఇది కాకుండా వ్యాధి సోకిన రోగి ఉపయోగించే బట్టలు, షీట్లు, టవల్స్ మొదలైన వాటిని ఉపయోగించకూడదు. లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మంకీపాక్స్ లక్షణాలు
జ్వరం
మంకీపాక్స్ తరచుగా అధిక జ్వరంతో మొదలవుతుంది. ఈ జ్వరం సాధారణ వైరల్ ఫివర్ కంటే ఎక్కువ కాలం ఉంటుంది. దీంతో పాటు నొప్పి, బలహీనత వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
చర్మంపై దద్దుర్లు
జ్వరంతో పాటు శరీరంపై దద్దుర్లు, గాయాలు మొదలవుతాయి. ఈ దద్దుర్లు చిన్న బొబ్బలుగా ప్రారంభమవుతాయి. క్రమంగా పెద్దవిగా మారుతాయి. దద్దుర్లు సాధారణంగా ముఖం, చేతులు, కాళ్ళపై ఏర్పడతాయి.
వాపు
శోషరస కణుపుల వాపు మంకీపాక్స్ సాధారణ లక్షణం. మెడ, చంకలు, నడుము వంటి ప్రదేశాల్లో వస్తాయి. ఈ వాపులు సంక్రమణ తీవ్రతను పెంచుతాయి.
అలసట
మంకీపాక్స్ బారిన పడిన వ్యక్తి సాధారణ శరీర నొప్పులు, అలసట వంటి లక్షణాలను కల్గి ఉంటారు. ఈ లక్షణాలు ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయి. కానీ ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి.
గొంతు నొప్పి, తలనొప్పి
నిరంతర గొంతు నొప్పి, తలనొప్పి కూడా మంకీపాక్స్ లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా జ్వరం, ఇతర శరీర లక్షణాలతో కలిసి తీవ్రతను పెంచుతాయి.
ఇవి కూడా చదవండి:
Lightning Effect: పిడుగుపాటుతో ఏడుగురు మృతి, మరో ముగ్గురికి గాయాలు
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Stock Market: వచ్చే వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది.. క్షీణిస్తుందా, పెరుగుతుందా..
Money Saving Tips: రోజు రూ.250 సేవ్ చేయండి.. ఇలా రూ.2 కోట్లు సంపాదించండి..
Read MoreNational News and Latest Telugu News
Updated Date - Sep 08 , 2024 | 08:50 PM