ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lok Sabha 2024: ఒకే కుటుంబం నుంచి ఐదుగురు ఎంపీల ప్రమాణం..

ABN, Publish Date - Jun 26 , 2024 | 03:47 PM

ఎన్నికల్లో గెలవడం అంటే అంతా ఈజీ కాదు.. వార్డు సభ్యుడిగా గెలవడానికే చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. అదే ఎమ్మెల్యే, ఎంపీ కావడమంటే మామూలు విషయమా.. కానీ ఈ కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీలు కావడం ఎంతో ఈజీ.

Akilesh Yadav Family

ఎన్నికల్లో గెలవడం అంటే అంతా ఈజీ కాదు.. వార్డు సభ్యుడిగా గెలవడానికే చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. అదే ఎమ్మెల్యే, ఎంపీ కావడమంటే మామూలు విషయమా.. కానీ ఈ కుటుంబానికి ఎమ్మెల్యే, ఎంపీలు కావడం ఎంతో ఈజీ.. సాధారణంగా ఒక కుటుంబం నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యే, ఎంపీలు కావడమే అతికష్టం. సుదీర్ఘ రాజకీయ అనుభవం నుంచి, ప్రజల ఆదరాభిమానాలు పొందితేనే ఒకే కుటుంబంలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులు కాగలరు. ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్ కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు ఎంపీలయ్యారు. ఆ ఐదుగురు మంగళవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు.
Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు


అఖిలేష్ యాదవ్ తండ్రి దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ సుదీర్థకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ములాయంసింగ్ రాజకీయ వారసుడిగా అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీపార్టీ బాధ్యతలు స్వీకరించాడు. అఖిలేష్ కూడా యూపీ సీఎం పనిచేశారు. యాదవ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్‌లో గట్టిపట్టుంది. మరోవైపు బలమైన యాదవసామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆ కుటుంబానికి కలిసొచ్చింది. ఈసారి ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ఐదుగురు ఎంపీలుగా పోటీచేసి గెలిచారు.

Om Birla 2.0: ఓం బిర్లా ఎవరు.. రాజకీయ నేపథ్యమేంటి?


ఆ ఐదుగురు ఎవరంటే..?

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుండి 2.21 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ధర్మేంద్ర యాదవ్ అజంగఢ్ నుంచి, అక్షయ్‌ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి, ఆదిత్య యాదవ్ బదౌన్ నుంచి విజయం సాధించారు.


Lok Sabha Speaker Election: లోక్‌సభ స్పీకర్ పదవి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా గ్రాండ్ విక్టరీ

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

For More National News and Latest Telugu News click here

Updated Date - Jun 26 , 2024 | 03:48 PM

Advertising
Advertising