Flixbus: రూ. 99 లకే హైదరాబాద్ నుంచి బెంగళూరు.. అది కూడా ఏసీ బస్సులో..
ABN, Publish Date - Sep 04 , 2024 | 10:02 PM
Flixbus Service: ఆఫర్ అంటే ఇదీ.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అని అందరూ భావించి సూపర్ డూపర్ ఆఫర్ గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నారు. సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఒక స్టాప్ నుంచి మరో స్టాప్‌కి వెళ్లాలంటే మినిమం ఛార్జి కింద రూ. 10 గానీ రూ. 20 గానీ వసూలు చేస్తారు. ఇక ఏసీ బస్సుల్లో అయితే ఛార్జీల గురించి చెప్పనవసరమే లేదు.
Flixbus Service: ఆఫర్ అంటే ఇదీ.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అని అందరూ భావించి సూపర్ డూపర్ ఆఫర్ గురించి ఇవాళ మేం మీకు చెప్పబోతున్నారు. సాధారణంగా ఆర్టీసీ బస్సులో ఒక స్టాప్ నుంచి మరో స్టాప్‌కి వెళ్లాలంటే మినిమం ఛార్జి కింద రూ. 10 గానీ రూ. 20 గానీ వసూలు చేస్తారు. ఇక ఏసీ బస్సుల్లో అయితే ఛార్జీల గురించి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ఆ రేంజ్‌లో ఉంటాయి. మొత్తం బస్సులో సుదూర ప్రయాణం చేయాలంటే.. జేబుల్లో డబ్బులు దండిగా ఉండాల్సిందే. లేదంటే ప్రయాణం కష్టమే. కానీ, ఇక్కడ ఓ బస్ సర్వీస్ సంస్థ మాత్రం కేవలం 99 రూపాయలకే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే సదుపాయం కల్పిస్తోంది. అదికూడా ఏసీ సర్వీస్. అవును మీరు చదువుతున్నది నిజంగా నిజం. ఈ కళ్లు చెదిరే ఆఫర్‌ను ఫ్లిక్స్ బస్ సంస్థ ప్రకటించింది. రూ. 99 లకు ఫుల్ మీల్స్ కూడా రాని ఈ రోజుల్లో ఏకంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశాన్నిస్తోంది ఫ్లిక్స్ బస్.
ఇంతకీ ఆ సంస్థ వివరాలేంటి? ఎందుకీ ఆఫర్ ఇచ్చింది? అసలు కథేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. జర్మనీకి చెందిన ట్రావెల్ టెక్ సంస్థ ఫ్లిక్స్‌బస్ ఇండియా.. దక్షిణాది రాష్ట్రాల్లో తన సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్, గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సంస్థ సహ వ్యవస్థాపకుడు డేనియల్ క్రాస్.. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నై సర్వీస్‌లు ప్రారంభించారు. జెండా ఊపి ఈ బస్సులను ప్రారంభించారు. బెంగళూరు నుంచి దక్షిణాది 33 నగరాలకు ఫ్లిక్స్ బస్ సర్వీస్‌లను నడపున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
అయితే, సర్వీసుల విస్తరణ నేపథ్యంలో అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. రూ. 99 తోనే టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 6 తేదీల మధ్య ప్రయాణాలకు సెప్టెంబర్ 3 నుంచి 15 తేదీల టికెట్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఈ మధ్య తేదీల్లో ప్రయాణించే వారికి రూ. 99 టికెట్ వర్తిస్తుందని తెలిపారు. ఫ్లిక్స్ బస్ సేవలు కోయంబత్తూరు, మధురై, తిరుపతి, విజయవాడ, బెలగావిలకు కూడా విస్తరించడం జరుగుతుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
ఫ్లిక్స్ బస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సూర్య ఖురానా మాట్లాడుతూ.. ఉత్తర భారతదేశంలో తమ కార్యకలాపాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. ఇప్పుడు తమ సేవలను దక్షిణ భారతదేశానికి విస్తరించడం జరిగిందన్నారు. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చడమే తమ తదుపరి లక్ష్యం అని పేర్కొన్నారు.
Also Read:
ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వాని కేసులో హైకోర్ట్ కీలక ఆదేశాలు
అదంతా అబద్ధం.. ఎవరూ నమ్మొద్దు..
ప్రాణాలతో చెలగాటం అంటే ఇదే..
For More National News and Telugu News..
Updated Date - Sep 04 , 2024 | 10:08 PM