మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kamal Nath : కాంగ్రెస్‌ను వీడుతున్నారన్న వదంతులకు చెక్.. ప్రచారం ప్రారంభించిన మాజీ సీఎం..

ABN, Publish Date - Feb 16 , 2024 | 03:32 PM

లోక్ సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రానప్పటికీ.. ప్రధాన పార్టీలు తమ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా..

Kamal Nath : కాంగ్రెస్‌ను వీడుతున్నారన్న వదంతులకు చెక్.. ప్రచారం ప్రారంభించిన మాజీ సీఎం..

లోక్ సభ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతోంది. ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రానప్పటికీ.. ప్రధాన పార్టీలు తమ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుండగా.. ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తు్న్నారు. దీంతో నేతల పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంపింగ్ లు షరా మామూలయ్యాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సైతం పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. ఈ వార్తలపై మాజీ సీఎం స్పందించారు. పార్టీ మారే సమస్యే లేదని క్లారిటీ ఇచ్చేశారు.

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అమరవాడ, హర్రాయి ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరుతున్నారనే ఆరోపణలపై ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తాను చింద్వారాకు వచ్చిన సమయంలో మురుగుకాలువలు, రోడ్లు లేవని చెప్పారు. భోపాల్, నాగ్‌పూర్ ప్రజలకు చింద్వారా గురించి తెలియదని, వారు చాలా చులకనగా మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం చింద్వారా అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు.


మరోవైపు ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను నియమించింది. అయితే ఎన్నాళ్లు గానో రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్న సీనియర్ పార్టీ నాయకుడు, మాజీ సీఎం కమల్ నాథ్ పేరు కాంగ్రెస్ జాబితాలో లేకపోవడం గమనార్హం. కమల్ నాథ్ రాజ్యసభకు మారాలని కోరుకున్నారని తన డిమాండ్ కోసం ఒత్తిడి చేయడానికి సోనియా గాంధీని కూడా కలిశారని వర్గాలు ముందుగా తెలిపాయి.

ఈ పరిణామాల నడుమ ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జరిగింది. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో కమల్ నాథ్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 16 , 2024 | 03:32 PM

Advertising
Advertising