ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Former CM: ‘కుమార’ విందుకు ఎన్నికల అధికారుల చెక్‌.. తోటలో ఏర్పాటు చేసిన కుర్చీలు, షామియానాల తొలగింపు

ABN, Publish Date - Apr 11 , 2024 | 12:07 PM

మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత, మండ్య లోక్‌సభ అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy)కి చెందిన బిడది తాలూకా కేతగానహళ్లి తోటలో ఉగాది పండుగ తర్వాత ఏర్పాటు చేసిన మాంసాహార విందుకు ఎన్నికల అధికారులు చెక్‌ పెట్టారు.

- పండుగ చేసుకోవడమూ నేరమేనా..? : కుమారస్వామి

బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ నేత, మండ్య లోక్‌సభ అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy)కి చెందిన బిడది తాలూకా కేతగానహళ్లి తోటలో ఉగాది పండుగ తర్వాత ఏర్పాటు చేసిన మాంసాహార విందుకు ఎన్నికల అధికారులు చెక్‌ పెట్టారు. మండ్య ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకులను విందుకు ఆహ్వానించారు. మధ్యాహ్నం విందు ఉంటుందనే సమాచారం తెలిసిన మేరకు కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు తోటను సందర్శించారు. విందుకు ఏర్పాటు చేసుకున్న కుర్చీలను, షామియానాలను తొలగించారు. ఇదే విషయమై కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ చేసే విందులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, తాము నలుగురు కలిస్తే నేరమవుతోందని మండిపడ్డారు. బిడది తోటలో విందు ఏర్పాటు చేయలేదని, తమకు ఎన్నికలకు అదే కార్యాలయమన్నారు. ఎవరు తహసీల్దారుపై ఒత్తిడి తెచ్చారో తనకు తెలుసు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మా సంప్రదాయాలు, సంస్కృతి అంటే గిట్టదన్నారు. హిందువుల పండుగలంటే వారికి పచ్చకామెర్లు అని ఆరోపించారు. ఇదే విషయమై జేడీఎస్‌ పార్టీ ‘ఎక్స్‌’ ద్వారా ఓ పోస్ట్‌ చేసింది. ప్రతి హిందువు ఇంట్లోనూ ఉగాది(Ugadi) తర్వాత మాంసాహార విందు జరుగుతుందని, అదే తరహాలోనే కుమారస్వామి తోటలోనూ రాజకీయ మిత్రులు, బంధువులను విందుకు పిలిచారన్నారు. పాడ్యమి అంటే మాంసాహార విందు అన్నారు. అక్కడ నగదు, మద్యం, చీరలు, కుక్కర్లు, ఫ్రిజ్‌లు, కూపన్‌లు పంచే విధానం ఉండదని పరోక్షంగా డీకే శివకుమార్‌, డీకే సురేశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదికూడా చదవండి: Veerappan: వీరప్పన్‌ కుమార్తె ఎన్టీకే అభ్యర్థి.. భార్య డీఎంకేకు మద్దతుగా ప్రచారం

Updated Date - Apr 11 , 2024 | 12:07 PM

Advertising
Advertising