ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Former CM: సీఎంగారూ.. మీరే పగటి కలలు కంటున్నారు..

ABN, Publish Date - Oct 24 , 2024 | 12:15 PM

తనను కలలు కనవద్దంటూ ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) కౌంటర్‌ ఇచ్చారు. తాను కలలు కనడం లేదని, ముఖ్యమంత్రి స్టాలినే పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

- సీఎంపై ఈపీఎస్‌ ఆగ్రహం

చెన్నై: తనను కలలు కనవద్దంటూ ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) కౌంటర్‌ ఇచ్చారు. తాను కలలు కనడం లేదని, ముఖ్యమంత్రి స్టాలినే పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. సేలంలో బుధవారం జరిగిన పార్టీ నిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న ఎడప్పాడి మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా అన్నాడీఎంకే ప్రభుత్వంలో అనేక పథకాలను తెచ్చామని, వాటిని అమలు చేస్తే అన్నాడీఎంకేకు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో గత 41 నెలల డీఎంకే ప్రభుత్వంలో ఆ పథకాలన్నింటినీ అటకెక్కించిదన్నారు. తనను ఒక జ్యోతిష్యుడిగా, కలలు కంటున్నట్టుగా సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారని, నిజానికి సీఎం స్టాలినే పగటి కలలు కంటున్నారని ఈపీఎస్‌ ఎద్దేవా చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Diwali: దీపావళి ఎఫెక్ట్.. సొంతూళ్లకు లక్షలాది మంది ప్రయాణం


నీట్‌పై తొలి సంతకం ఎక్కడ?

డీఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే నీట్‌ రద్దుపై తొలి సంతకం ఉంటుందని ఊకదంపుడు ప్రచారం చేశారని, ఇప్పటి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటై 41 నెలలైనా ఇంకా నీట్‌ రద్దుపై ఎందుకు సంతకం చేయలేదని ఈపీఎస్‌ నిలదీశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే(AIADMK) ఓటు బ్యాంకు క్షీణించిపోయిందని స్టాలిన్‌ పేర్కొన్నారని, కానీ నామక్కల్‌ లోక్‌సభ స్థానంలో కేవలం 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలు లేనిపోని విషయాలు మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఈపీఎస్‌ స్పష్టం చేశారు.


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 12:15 PM