ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RS Bharathi: సీబీఐ విచారణపై మాజీసీఎం ద్వంద్వ వైఖరి

ABN, Publish Date - Nov 22 , 2024 | 11:23 AM

మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) సీబీఐ విచారణపై తనకోవిధంగా, ఇతరులకు మరో విధంగా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharathi) ఆరోపించారు. అన్నా అరివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

- డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి ఆరోపణ

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) సీబీఐ విచారణపై తనకోవిధంగా, ఇతరులకు మరో విధంగా ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి(RS Bharathi) ఆరోపించారు. అన్నా అరివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కళ్లకురిచ్చి కల్తీసార సంఘటపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లకూడదంటూ ఈపీఎస్‌ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: బిచ్చగాడి ప్రాణం తీసిన బీడీ ముక్క


ఈపీఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రహదారుల శాఖలో జరిగిన రూ.4800 కోట్ల మేరకు జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించాలని కోరుతూ తాను హైకోర్టులో పిటిషన్‌ వేశానని, తాను అడగకపోయినా న్యాయస్థానం ఆ అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. ఆ సమయంలో హైకోర్టు తనకు వ్యతిరేకంగా సీబీఐ విచారణకు ఆదేశించాడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న విషయాన్ని ఆర్‌ఎస్‌ భారతి గుర్తుచేశారు. అవినీతి కేసులో తనకు వ్యతిరేకంగా సీబీఐ విచారణ జరగకూడదని అప్పీలు చేసుకున్న ఈపీఎస్‌, కళ్లకురిచ్చి కల్తీసారా సంఘటనపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంపై అప్పీలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించకూడదని ఎలా చెబుతారని ఆయన ధ్వజమెత్తారు.


హోసూరు కోర్టు సమీపంలో లాయర్‌పై జరిగిన దాడి, తంజావూరులో టీచర్‌పై జరిగిన హత్య ప్రైవేటు వ్యక్తులు కక్షల నేపథ్యంలో చేస్తే ఆ రెండు సంఘటనల వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఈపీఎస్‌ గగ్గోలు పెట్టడం మరీ వింతగా ఉందన్నారు. ఈపీఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa)కు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో హత్య, హత్యాయత్నం, ఆత్మహత్య వంటి సంఘటనలు కూడా జరిగి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన పాత సంగతులు ఆయనకు గుర్తుకురావటం లేదని ఆర్‌ఎ్‌సభారతి ఎద్దేవా చేశారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య

ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..

ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు భేటీ

ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2024 | 11:23 AM