Farooq Abdulla: విచారణకు హాజరు కాలేను.. ఈడీ సమన్లపై ఫరూక్ అబ్దుల్లా వైఖరి..
ABN , Publish Date - Feb 14 , 2024 | 11:58 AM
విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పంపిన నోటీసును జమ్మూ- కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తిరస్కరించారు. విచారణకు హాజరు కాలేనని తెలిపారు.
విచారణకు హాజరు కావాలంటూ ఈడీ పంపిన నోటీసును జమ్మూ- కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తిరస్కరించారు. విచారణకు హాజరు కాలేనని తెలిపారు. ప్రస్తుతం తాను జమ్మూలో ఉన్నందున ఈడీ కార్యాలయానికి వెళ్లలేకపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ కేసులో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఈడీ గతంలోనూ సమన్లు జారీ చేసింది. జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఈడీ ఆరోపిస్తూ విచారణకు రావాలని జనవరి 11న సమన్లు జారీచేసింది. అయినా అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేదు. దీంతో ఫిబ్రవరి 13న విచారణకు రావాలన్న ఆదేశాలను పాటించకపోవడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.