Bengaluru : హోమో సెక్స్ కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్టు
ABN, Publish Date - Jun 24 , 2024 | 04:17 AM
మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ హోమోసెక్స్ కేసులో అరెస్టయ్యారు. అసహజ లైంగిక దౌర్జన్యం వివాదంలో సాక్ష్యాలను పోలీసులకు వివరించేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ సూరజ్‌ను హొళెనరసీపుర పోలీసులు శనివారం రాత్రంతా విచారించారు.
మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి మరో షాక్
ఇప్పటికే లైంగిక దౌర్జన్యాల కేసులో జైలు పాలైన ప్రజ్వల్ రేవణ్ణ
హోమో సెక్స్ కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్టు
బెంగళూరు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ హోమోసెక్స్ కేసులో అరెస్టయ్యారు. అసహజ లైంగిక దౌర్జన్యం వివాదంలో సాక్ష్యాలను పోలీసులకు వివరించేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ సూరజ్‌ను హొళెనరసీపుర పోలీసులు శనివారం రాత్రంతా విచారించారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు సూరజ్ రేవణ్ణను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. సూరజ్‌పై ఐపీసీ 377 (అసహజ లైంగిక దౌర్జన్యం), 342, 506, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనపై సూరజ్‌రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని జేడీఎస్ పార్టీకి చెందిన కార్యకర్త ఒకరు ఆరోపించారు.
ఈ ఆరోపణలను సూరజ్‌రేవణ్ణ ఖండించారు. తననుంచి రూ.5కోట్లు పొందాలని చేతన్ అనే వ్యక్తి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలావివాదం సాగుతుండగానే.. తనను చేతన్ బ్లాక్‌మెయిల్ చేసినట్లు సాక్ష్యాలున్నాయంటూ శనివారం రాత్రి సూరజ్‌రేవణ్ణ హొళెనరసీపుర గ్రామీణ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లారు. అయితే, చేతన్ అంతకుముందే డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు సూరజ్‌ను తెల్లవారుజామున 4 గంటలదాకా విచారణ జరిపారు. తర్వాత అరెస్టు చేశారు. మరోవైపు బాధితుడిని బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Updated Date - Jun 24 , 2024 | 04:17 AM